మోహన్ బాబు హెయిర్ డ్రెస్సెర్‌కి నాగబాబు సహాయం - MicTv.in - Telugu News
mictv telugu

మోహన్ బాబు హెయిర్ డ్రెస్సెర్‌కి నాగబాబు సహాయం

March 3, 2022

20

టాలీవుడ్‌లో కలెక్షన్ కింగ్‌గా పేరు సంపాదించుకున్న మోహన్ బాబు తన వద్ద 11 సంవత్సరాలపాటు హెయిర్ డ్రెస్సెర్‌గా పనిచేసిన నాగశ్రీను అనే వ్యక్తిని కులం పేరుతో దూషించి, మోకాళ్ళపై కుర్చోబెట్టి అవమానించారని, తనకు పోలీసులు న్యాయం చేయాలని తాజాగా హెయిర్ డ్రెస్సెర్ పోలీసులను వేడుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 17 నుంచి పని మానేయడంతో ప్రస్తుతం కష్టాలలో ఉన్న హెయిర్ డ్రెస్సెర్‌ నాగశ్రీనుకు నటుడు, నిర్మాత నాగబాబు చేయూతనిచ్చారు. తన తల్లి అనారోగ్యానికి గురైందని, రోజు రోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో తీవ్ర ఇబ్బందికి గురౌతున్న నాగశ్రీనుకు గురువారం నాగబాబు 50,000 రూపాయలను అందించారు. అంతేకాకుండా నాగశ్రీను కూతుళ్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న నాగబాబు.. వారి ఆరోగ్యం పరంగా ఏ చిన్న సమస్య ఉన్న వైద్యం కోసం అపోలో ఆసుపత్రిలో ఫ్రీ మెడికల్ చెకప్ చేసే ఏర్పాట్లను కల్పించి, కుటుంబానికి అండగా నిలిచారు.

మరోపక్క ‘మా’ ఎన్నికల సమయంలో మోహన్ బాబు కుటుంబ సభ్యులకు, మెగాస్టార్ చిరంజీవి కుటంబ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల వ్యవహారంలో సీఎం జగన్‌ను చిరంజీవి, రాజామౌళి, కొరటాల శివ, మహేశ్ బాబు, ప్రభాష్‌లు కలిశారు. ఆ సమయంలో మంచు విష్ణు తన తండ్రికి ఏపీ ప్రభుత్వం నుంచి పిలుపువచ్చిన కొంతమంది ఆ పిలుపును దొంగిలించారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అనంతరం మోహన్ బాబు సైతం స్పందిస్తూ, తనపై ఓ ఇద్దరు హీరోలు కక్ష్యగట్టారు అంటూ వారు ఎవరో తనకు తెలుసు కానీ, వారి పేర్లు చెప్పాను అంటూ ఫైర్ అయ్యారు. ఇటువంటి సమయంలో మోహన్ బాబు హెయిర్ డ్రెస్సర్‌కి నాగబాబు సహాయం చేయడం ఆసక్తికరంగా మారింది.