నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎం అవుతా: గాలి జనార్దన్‌ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎం అవుతా: గాలి జనార్దన్‌ రెడ్డి

June 23, 2022

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్దన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ”నాకు ఎమ్మెల్యే అవ్వాలని గాని, మంత్రి అవ్వాలని గాని ఆశలు ఏమి లేవు. కానీ, నేను గనుక మనసు పెడితే మాత్రం ఒక్క రోజైనా సీఎంని అవుతా” అని ఆయన అన్నారు.

తాజాగా ఆయన బళ్లారిలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ”రెడ్డి బ్రదర్స్‌కు, శ్రీరాములకు డబ్బుపై ఆశ లేదు. నాకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా లేదు. నాకు ఇబ్బందులు సృష్టించాలని కొందరు ఆదేశాలు జారీ చేసినట్లు సీబీఐ అధికారులు నాతో చెప్పారు. నేను మనసుపెడితే ఒక్క రోజైనా సీఎంని అవుతా” అని అనడంతో అక్కుడున్న కార్యకర్తలు, బంధుమిత్రులు ఆయనపై పూల వర్షం కురిపించారు.

గాలి జనార్థన్ రెడ్డి.. కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఆయన ఒకరు. బి.ఎస్. యడ్యూరప్ప మంత్రివర్గంలో పర్యాటక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో బళ్లారి, ఓబుళాపురం అక్రమ మైనింగ్ కుంభకోణంలో చిక్కుకున్నారు. దాంతో జ్యుడీషియల్ కస్టడీలో ఏళ్ల తరబడి జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన తన సోదరుడు గాలి సోమశేఖర రెడ్డి 57వ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. తాను మనసుపెడితే ఒక్క రోజైనా సీఎం అవుతానని వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటకలో హాట్ టాఫిక్‌గా మారింది.