భారత్ ఆటగాళ్ళు అదరగొట్టారు. కొత్త సంవత్సరంలో మెదటి సిరీస్‌ను దక్కించుకున్నారు. శ్రీలంకపై మూడు టీ20లో రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి కప్పు కైవసం చేసుకుంది టీం ఇండియా. సీనియర్ల గైర్హజరిలో హార్దిక్ పాండ్యా జట్టును అద్భుతంగా నడిపించాడు. మెదటి రెండు టీ20లో కాస్త తడబడిన మూడో ట20లో మాత్రం ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. సిరీస్‌లో ఓ అర్థ సెంచరీ, ఓ మెరుపు సెంచరీతో టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఆఖరి మ్యాచ్ లో మిస్టర్ 360 వీరవిహారం చేసాడు. తనకే సాధ్యమైన ప్రత్యేక షాట్లతో క్రికెట్ ప్రేక్షుకులను అలరించాడు. వచ్చిన బంతి వచ్చినట్లుగానే బౌండరీకి పంపించేశాడు సూర్య. బౌలర్ ఎలా వేసినా..ఎలా కొట్టిని బంతి బౌండరీ బాదడమే లక్యంగా అతడి ఆట సాగింది. ఈ క్రమంలోనే 51 బంతుల్లో 112 పరుగులు చేసి కొత్త రికార్డులను తన పేరిట రాసుకున్నాడు.
సూర్య సెంచరీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడి బ్యాటింగ్‌కు మాజీలు సైతం ఆశర్యపోయారు. ఆ షాట్లను, ఆటను పొగడకుండా ఉండలేకపోతున్నారు. మాజీ విధ్వంసక ఆటగాడు డివిలయర్స్ నుంచి భారత్ కోచ్ ద్రవిడ్ వరకు ప్రతీ ఒక్కరు కొనియాడిన వాళ్లే. మ్యాచ్ అనంతరం సూర్యను ఇంటర్వ్యూ చేసిన ద్రవిడ్ వేసిన ప్రశ్నలు నవ్వులు పూయిస్తున్నాయి. సూర్య చిన్నతనంలో నా బ్యాటింగ్ చూసి ఉండడని అందకే ఇప్పుడు ఇలా చితక్కొడుతున్నాడని వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ ముగిశాక సూర్యకుమార్ బ్యాటింగ్‌పై కెప్టెన్ హార్దిక్ పాండ్యా పొగడ్తల వర్షం కురిపించాడు. సూర్య ఇన్నింగ్స్ ప్రతి ఒక్కరీకి ఆశ్చార్యానికి గురిచేసిందన్నాడు. ” సూర్యకు బౌలింగ్ చేయకపోవడం సంతోషంగా ఉంది. ఒక వేళ నేనే అతడికి బౌలింగ్ చేస్తే చాలా బాధపడేవాడిని. అలాంటి షాట్లు అడితే ఏ బౌలర్‌కైనా కష్టమే. ఒకదాని తర్వాత మరొకటి ఇలా వినూత్నంగా షాట్లు కొట్టడం అతడికే సాధ్యం” అని హార్దిక్ వెల్లడించాడు. అక్షర్ పటేల్ ప్రదర్శన నన్ను గర్వపడేలా చేసిందని తెలిపాడు. కెప్టెన్‌గా ఆటగాళ్లకు మద్దుతగా నిలవడమే తన లక్ష్యమని హార్దిక్ తెలిపాడు.