అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”రష్యా అధ్యక్షుడు పుతిన్ తరుచూ అణు అనే పదాన్ని వాడుతున్నారు. నేనే గనుక ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఆ పదం వాడకూడదు అని పుతిన్‌కు గట్టిగా హెచ్చరించి చెప్పేవాడిని. పుతిన్ ప్రతీరోజూ అణ్వాయుధ ప్రస్తావన తీసుకొస్తుండడంతో అందరూ భయపడుతున్నారు” అని ట్రంప్ అన్నారు.
అంతేకాకుండా, అమెరికా దగ్గర రష్యా కంటే అధికంగా ఆయుధ సంపత్తి ఉందని, తాము మరింత శక్తిమంతమైన వాళ్లమని అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకోవాలని తాను పుతిన్‌కు గట్టిగా చెప్పేవాడినని తెలిపారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. ఉక్రెయిన్‌పై దాడిని ఆపకుంటే అమెరికా స్పందన ఎలా ఉంటుందనే ఈ విషయాన్ని గురించి తాను ఇప్పటికే పుతిన్‌కు చెప్పానని ట్రంప్ అన్నారు.
మరోపక్క ఉక్రెయిన్‌పై రష్యా సైన్యాలు యుద్దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. భీకరమైన దాడులు చేస్తూ, ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను ఆక్రమించుకుంటున్నాయి. ఉక్రెయిన్‌లో ఎక్కడ చూసినా శవాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనలు చూస్తున్న ప్రపంచ ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. పుతిన్ ఇప్పటికైనా యుద్దాన్ని ఆపాలని ప్రజలు కోరుతున్నారు.
Ukraine, Russia, former president, Donald Trump, sensational remarks, Putin, Zhelensky, war