సిక్స్ కొడితే, బంతి వెళ్లి బీరులో పడింది..వీడియో ఇదిగో - MicTv.in - Telugu News
mictv telugu

సిక్స్ కొడితే, బంతి వెళ్లి బీరులో పడింది..వీడియో ఇదిగో

June 11, 2022

ఓ బ్యాట్‌మెన్ సిక్స్ కొడితే, బంతి వెళ్లి బీరులో పడిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోను వీక్షిస్తున్న నెటిజన్ వాట్ ఏ షాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, మరికొంతమంది అయ్యో పాపం అంటూ సానుభూతి చూయిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లే.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండోవ టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. న్యూజిలాండ్ క్రికెట‌ర్ డారెల్ మిచ్చెల్ కొట్టిన భారీ సిక్స‌ర్‌తో ఓ అభిమాని బీర్ గ్లాస్ ప‌గిలిపోయింది. టాప్ ఫామ్‌లో ఉన్న మిచ్చెల్‌ 56వ ఓవ‌ర్‌లో భారీ షాట్ కొట్టాడు. జాక్ లీచ్ బౌలింగ్‌లో ముంద‌కు వ‌చ్చి మ‌రీ సిక్స‌ర్ బాదాడు. ఆశ్చ‌ర్య‌క‌ర‌రీతిలో ఆ బంతి లాంగ్ ఆన్ మీదుగా వెళ్లి ప్రేక్ష‌కుల స్టాండ్‌లో ప‌డింది. ఏకంగా ఆ బంతి ఓ మ‌హిళా అభిమాని బీర్ గ్లాస్‌లో ప‌డ‌డంతో ఆ గ్లాస్‌లో ఉన్న బీరంతా చిల్లిపోయింది.

 

దాంతో బంతి నుంచి త‌ప్పించుకునేందుకు ప్రేక్ష‌కుల ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో ఆ బంతి నేరుగా వెళ్లి బీర్ గ్లాస్‌లో ప‌డ‌డంతో న‌వ్వులు విరిశాయి. ఇక, కామెంటేట‌ర్లు కూడా తమ వ్యాఖ్య‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. రెండ‌వ టెస్టు తొలి రోజు న్యూజిలాండ్ 4 వికెట్ల‌కు 318 ర‌న్స్ చేసింది. మిచ్చెల్ 81 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఈ వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారిపోయింది. ‘ఇంకో బీరు ఇప్పించండి..’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. కాగా, బీరు గ్లాసు పట్టుకున్న అభిమాని పేరు సూసాన్‌గా అధికారులు గుర్తించారు. మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ అభిమాని అయిన ఆమెకు న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ క్షమాపణలు చెప్పింది.