If LIC document is lost how to get duplicate bond
mictv telugu

ఎల్ఐసీ డాక్యుమెంట్ పోయిందా…డోంట్ వర్రీ ఇలా చేయండి..!!

January 16, 2023

If LIC document is lost how to get duplicate bond

ఎల్ఐసీ. భారత జీవిత బీమా సంస్థ. దీనికి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనం ఎల్ఐసీ నుంచి ఏదైనా ఒక పాలసీ తీసుకున్నప్పుడు …ఈ సంస్థ నుంచి ఒక బాండ్ జారీ చేస్తుంది. ఆ బాండ్ పై పాలసీ నెంబర్, పాలసీదారుడి పేరుతోపాటు నామినీ సలహా పాలసీకి సంధించిన వివరాలన్నీ కూడా ఈ బాండ్ లో ఉంటాయి. మన పాలసీపై ఎప్పుడైన లోన్ తీసుకోవల్సిన సందర్భం వచ్చినప్పుడు లేదా క్లైయిమ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ బాండ్ చాలా కీలకం. అందుకే ఈ బాండ్ అత్యంత జాగ్రత్తగా భద్రపరుచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఏదైనా కారణంగా ఎల్ఐసీ పాలసీ డాక్యుమెంట్ పోయినట్లయితే ఏం చేయాలి. లేదంటే అనుకోకుండా అగ్నిప్రమాదాలు, వరదల కారణంగా పోతే ఏంచేయాలి. దీనికి గురించి బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే పాలసీదారుడికి డూప్లికేట్ బాండ్ ను కూడా ఎల్ఐసీ జారీ చేస్తుంది. ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్ పోయినట్లయితే…ఈ డూప్లికేట్ డాక్యుమెంట్ అస్సలు డాక్యుమెంట్ వలే పనిచేస్తుంది. అయితే ఆ డూప్లికేట్ బాండ్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మీ పాలసీ డాక్యుమెంట్ పోయినట్లయితే ఆ విషయాన్ని ముందుగా మీ ఎల్ఐసీ ఏజెంట్ కు తెలియజేయాలి. లేదంటే డైరెక్టుగా ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లి కంప్లైట్ చేయాలి.

2. డూప్లికేట్ బాండ్ కోసం మీరు చేసిన ప్రీమియం చెల్లింపులకు చెందిన పాత రసీదులను కార్యాలయంలో సమర్పించాలి.

3. పాలసీ విలువను బట్టి స్టాంప్‎డ్యూటీ చెల్లించి ఇండెమ్నిటీ బాండ్ ను నోటరీ చేయించుకోవాలి.

4. ఫొటో ఐడెంటిటీ కింద పాసుపోర్టు, పాన్‎కార్డ్, ఓటర్‎ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఏదైనా గుర్తింపు కార్డును సమర్పించాలి.

5. ఇక రెడిడెన్సీ ఫ్రూఫ్ కోసం టెలిఫోన్ బిల్లు, బ్యాంక్ అకౌంట్ స్టేట్‎మెంట్, ఎలక్ట్రిసిటి బిల్లు రేషన్ కార్డు ఇలా ఏవైనా సరే గుర్తింపు పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది.

6. పాలసీ ప్రిపరేషన్ ఛార్జీల కింద బ్రాంచ్ లో ఇవి సమర్పించాలి. కొంత మొత్తాన్ని కూడా చెల్లిస్తే…మీకు డూప్లికేట్ పత్రాలను జారీ చేస్తుంది.