నా కులం జోలికొస్తే.. చర్లపల్లి జైలే: బండ్ల గణేష్ - MicTv.in - Telugu News
mictv telugu

నా కులం జోలికొస్తే.. చర్లపల్లి జైలే: బండ్ల గణేష్

April 16, 2022

bam

సినీ నటుడు, నిర్మాత, పవన్ కల్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డాడు. ”అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్బాజీవి. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయం. ఆ కట్‌కి జనం కారం పెట్టడం ఖాయం విజయసాయి” అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు.

 

అంతేకాకుండా ‘నాకు కుల పిచ్చి లేదు. నా కులాన్ని నేను ప్రేమిస్తా. ప్రతి కులాన్ని గౌరవిస్తా. కమ్మ వారిని తిట్టడాన్ని తట్టుకోలేక పోతున్నా. నీకు నచ్చని వారిని పేరు పెట్టి తిట్టు. దయచేసి నా కులాన్ని తిట్టకు. ఇదేనా నీ సంస్కారం? నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు. ఎంపీగా ఉన్నానని, అధికారంలో ఉన్నానని కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావు’ అని బండ్ల గణేష్ తీవ్రంగా విమర్శించాడు.

ఈ ట్వీట్ తరువాత ఎంత ఇబ్బంది పెడతావో తెలుసు. అన్నిటికీ సిద్ధపడే చేస్తున్నా. చంద్రబాబుతో ఎదైనా ఉంటే ఆయనతో తేల్చుకో. విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాదు కొనుక్కో. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచిచూపిస్తారు. మా కులాన్ని ఎందుకు అన్ని విషయాల్లోకి లాగుతున్నవ్? కేసీఆర్‌ని చూసి నేర్చుకో. అన్ని కులాల్లో మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అయ్యా ఆంధ్రకి పట్టిన అష్ట దరిద్రమా, నీ పిచ్చకి, నీ కుల పిచ్చకి, నీ డబ్బు పిచ్చకి కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది అని గట్టి వార్నింగ్ ఇచ్చాడు.