రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి స్పష్టం చేశారు. ఒకవేళ చర్చలు జరిగి విఫలమైతే గనక మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనని హెచ్చరించారు. ‘యుద్ధం ఆపి శాంతి స్థాపనకు గల అవకాశాలను పరిశీలించాలని మాస్కోను కోరుతున్నా. ఉక్రెయిన్‌కు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. భద్రతా హామీలు, సార్వభౌమాధికారం, దేశ సమగ్రతను పునరుద్ధరించే అంశాలపై మాకు స్పష్టత కావాలి. అందుకోసం చర్చలు ఒక్కటే మార్గం’ అని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే రష్యా విచ్చలవిడిగా చేస్తోన్న బాంబు దాడుల్లో అనేక మంది అమాయకులు బలైపోతున్న అంశంపై స్పందిస్తూ.. రష్యా చేస్తున్న పని మాయని మచ్చగా మిగిలిపోతుంది. విచ్చలవిడిగా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని అభిప్రాయపడ్డారు.