If Nupur Sharma's head is brought, my assets will be written: Ajmer Vasi
mictv telugu

నుపుర్ శర్మ తలను తెస్తే, నా ఆస్తులు రాసిస్తా: అజ్మీర్ వాసి

July 5, 2022

If Nupur Sharma's head is brought, my assets will be written: Ajmer Vasi

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ బ‌హిష్కృత నేత నూపుర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లను ఖండిస్తూ, దేశవ్యాప్తంగా ఇప్పటికి నిరసనలు, ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు, నూపుర్ శ‌ర్మ వ్యాఖ్యలపై తాలిబ‌న్లు మొదలుకొని ఇరాన్‌, ఇరాక్‌, కువైట్‌, ఖ‌తార్‌, సౌదీ అరేబియా, ఒమ‌న్‌, యూఏఈ, జోర్డాన్‌, ఆప్ఘ‌నిస్ధాన్, పాకిస్తాన్, బ‌హ్రెయిన్‌, మాల్దీవులు, లిబియా, ఇండోనేషియా స‌హా 14 దేశాలు స్పందిస్తూ, ఆమె వ్యాఖ్యలను ఖండించాయి.

ఈ క్రమంలో రాజస్థాన్‌‌ రాష్ట్రం అజ్మీర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి నుపూర్ శర్శ వ్యాఖ్యలపై ఓ వివాదాస్పద ఆఫర్ చేశాడు. ” దేశ వ్యాప్తంగా ముస్లింలను హింసిస్తున్నారు. ఎవరైనా సరే నుపుర్ శర్మ తలను తీసుకొస్తే, వారికి నా ఆస్తులను ఇచ్చేస్తా. నా ఇల్లు, నా ప్రాపర్టీ మొత్తాన్ని రాసిస్తా” అంటూ ఓ వీడియో సందేశం నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియోను వీక్షించిన పోలీసు అధికారులు స్పందించారు. వీడియోలో ఆఫర్ ఇచ్చిన వ్యక్తి పేరు సల్మాన్ చిస్టీగా గుర్తించామని, చిస్టీ దర్గా ప్రాంతంలో అతడు నివాసం ఉంటున్నట్లు తెలిపారు. అనంతరం అడిషనల్ ఎస్పీ వికాస్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. ”నేను కూడా ఆ వీడియోను వాట్సాప్ ద్వారా చూశాను. సల్మాన్ మత్తులో మాట్లాడినట్టు ఉంది. సల్మాన్ కోసం గాలిస్తున్నాం. త్వరలోనే అతడిని పట్టుకొని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం” అని ఆయన అన్నారు.