ఒక్కరు బాధపడినా రాజకీయాల నుంచి తప్పుకుంటా -బాలినేని - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్కరు బాధపడినా రాజకీయాల నుంచి తప్పుకుంటా -బాలినేని

December 22, 2021

09

ఏ ఒక్క ఆర్యవైశ్యుడు తన వల్ల బాధపడినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు కారణం ఒంగోలు వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తాను సుభానీ తీవ్రంగా దూషిస్తూ, చేయి చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనం రేపిన విషయం విధితమే. ఆ వీడియో మంత్రి బాలినేని శ్రీనివాస్‌కు తలనొప్పిగా మారింది.

ఆ వీడియోలో ఉన్నది బాలినేని అనుచరుడేనంటూ విపక్షాలు గగ్గోలు పెడుతుండడంతో.. మంత్రి బాలినేని స్పందించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. ‘బాలినేని నాపై దాడి చేయించలేదు” అని స్వయంగా సుబ్బారావు గుప్తానే చెప్పినా తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. “గతంలో చెన్నైలో బంగారం వ్యాపారి డబ్బుతో దొరికితే నాదేనని అసత్య ప్రచారం చేశారు. టీడీపీ నేతలు అదేపనిగా కుయుక్తులు పన్నుతున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వైశ్యుల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. నావల్ల ఒక్క ఆర్యవైశ్యుడు బాధపడినా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.