ప్రభాస్ పెళ్లి చేసుకుంటేనే.. నేను చేసుకుంటా: శ్రీరాపాక - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్ పెళ్లి చేసుకుంటేనే.. నేను చేసుకుంటా: శ్రీరాపాక

April 6, 2022

bfbfd

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడు చేసుకుంటే, తాను అప్పుడే పెళ్లి చేసుకుంటానని.. ఓ బిగ్‌బాస్‌ బ్యూటీ సంచలన నిర్ణయం తీసుకుంది. గతకొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నాడు? అనే విషయంపై ఇటు సినీ పరిశ్రమ, అటు ప్రభాస్ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరికొంతమంది లేడీ అభిమానులు ప్రభాస్‌ ఒప్పుకుంటే మేము పెళ్లికి రెడీ అని ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తున్నారు. కానీ, ఈ బిగ్‌బాస్‌ బ్యూటీ మాత్రం ప్రభాస్‌ పెళ్లి చేసుకునేంత వరకు తాను కూడా చేసుకోనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఆమె ఎవరు? ఏ సినిమాలో నటించింది? ఎందుకు ఇలా ప్రభాస్ పెళ్లిపై వ్యాఖ్యలు చేసింది? అనే విషయంలోకి వెళ్తే.. ఆ బ్యూటీ పేరు శ్రీరాపాక. ఆమె ఆర్జీవీ ‘నగ్నం’ మూవీతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇటీవలే బిగ్‌బాస్‌ ఓటీటీలో మెరిశారు.

అయితే, రీసెంట్‌గా బిగ్‌బాస్‌ ఓటీటీలో సందడి చేసిన శ్రీరాపాక.. రెండోవారమే ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి వరస ఇంటర్య్వూలతో ఫుల్‌ బిజీగా మారింది. ఈ క్రమంలో ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రభాస్‌ పెళ్లిపై స్పందించింది. ప్రభాస్‌ను అభిమానిస్తున్న ఆమె.. ఆయన్ను కలిసే చాన్స్‌ మిస్‌ చేసుకున్నానంటూ వాపోయింది.

శ్రీరాపాక మాట్లాడుతూ..”ప్రభాస్‌ నటించిన ఈశ్వర్‌ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. అప్పటి నుంచి ప్రభాస్‌ అంటే నాకు క్రష్. ప్రుభాస్‌ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు జీవించిన చాలు. అది ఎలాగు జరగదు కాబట్టి ప్రభాస్‌ పెళ్లి చేసుకునేంత వరకు నేను వెయిట్‌ చేస్తా. ఆయన పెళ్లి తర్వాతే నేను పెళ్లి పీటలు ఎక్కుతా” అని శ్రీరాపాక అన్నారు. ఒకవేళ ఆయన పెళ్లి చేసుకోకపోతే తాను కూడా ఎప్పటికీ మ్యారేజ్‌ చేసుకోనని పేర్కొంది. కాగా, శ్రీరాపాక హీరోయిన్‌ కంటే ముందు పలు సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వర్క్‌ చేసింది.