రోజా గెలిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం : అచ్చెన్నాయుడు - MicTv.in - Telugu News
mictv telugu

రోజా గెలిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం : అచ్చెన్నాయుడు

March 8, 2022

24

దమ్ముంటే ఎమ్మెల్యే రోజా తన పదవికి రాజీనామా చేయాలని టీడీఎల్పీ నేత అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. నగరిలో తాము గెలవకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని ప్రకటించారు. మహిళలకు ఆర్ధిక స్వావలంబన కల్పించేలా చంద్రబాబు కృషి చేస్తే, ప్రజలను మోసం చేసి జగన్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కులం, మతం, ప్రాంతం వంటివి పట్టించుకోకుండా చంద్రబాబు సమర్థిస్తే… అధికారం కోసం ఏ గడ్డైనా తినే వ్యక్తి జగన్ అని తిట్టిపోశారు. సింపతీ కోసం కోడికత్తి డ్రామాలాడారని ఎద్దేవా చేశారు. అది వర్కౌట్ అవ్వకపోవడంతో మరింత సింపతీ కోసం సొంత బాబాయిని హత్య చేసినా పట్టించుకోని వ్యక్తి జగన్ అని తూలనాడారు. 151 సీట్లు వచ్చినా అనతి కాలంలోనే విపరీతమైన ప్రజా వ్యతిరేకతను తెచ్చుకున్నారన్నారు. మరోవైపు తెలుగు మహిళా అధ్యక్షురాలిని అనరాని మాటలు అంటున్నా జగన్ పట్టించుకోవట్లేదని, పైగా మహిళలకేదో మేలు చేస్తున్నట్టు సభలు పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, టెక్కలిలో రాజీనామా చేసి రావాలని ఎమ్మెల్యే రోజా సవాల్ చేయడంతో అచ్చెన్నాయుడు పైవిధంగా స్పందించారు.