సమంత ఎదురుపడితే ఈ పని కచ్చితంగా చేస్తా : నాగచైతన్య - MicTv.in - Telugu News
mictv telugu

సమంత ఎదురుపడితే ఈ పని కచ్చితంగా చేస్తా : నాగచైతన్య

August 10, 2022

సమంత, నాగచైతన్యల జోడీ విడిపోయినా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వారి జంటను ప్రేక్షకులు, అభిమానులు అంతగా ఓన్ చేసుకున్నారు. ఇటీవల కరణ్ జోహార్ సమంతను.. నాగచైతన్యతో ఓ గదిలో ఏకాంతంగా గడపాల్సి వస్తే ఏం చేస్తారు? అని ప్రశ్నించగా, అక్కడ పదునైన ఆయుధాలు లేకుండా చూడాలంటూ బదులిచ్చింది. తద్వారా తమ మధ్య ఎంత దూరం ఉందో చెప్పకనే చెప్పింది. కానీ, నాగచైతన్య మాత్రం సమంతపై అలాంటి అభిప్రాయం ఏమీ పెట్టుకోలేదు. ఇలాంటి ప్రశ్నే నాగచైతన్యను అడిగితే అందరూ ఆశ్చర్యపోయేలా ఆన్సరిచ్చాడు. ఒకవేళ సమంత ఎదురుపడితే ఏం చేస్తారని అడుగగా, హాయ్ చెప్పి హగ్ చేసుకుంటానని సాఫ్ట్‌గా, కూల్‌గా సమాధానమిచ్చాడు. దీంతో సమంత అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఇంకా మాట్లాడుతూ.. తన వివాహ తేదీని చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నానని, తన మాదిరి అభిమానులు అలాంటి పనులు చేయవద్దని సూచించాడు.