If 'Sitaram' was taken like that...it would have been on a different level: Paruchuri
mictv telugu

‘సీతారామం’ను అలా తీసుంటే..వేరే లెవెల్లో ఉండేది: పరుచూరి

September 10, 2022

తెలుగు సినీ ప్రేక్షకులకు ‘పరుచూరి బ్రదర్స్’ అంటే తెలియని వారుండరు. మాటల రచయితలుగా, నటులుగా, సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే వంటివి అందించి తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పటికి చెరిగిపోని ముద్రవేసుకున్నారు. ఈ క్రమంలో గతకొన్ని రోజులుగా పరుచూరి బ్రదర్స్‌లో చిన్నవారైన పరుచూరి గోపాలకృష్ణ..తాజాగా విడుదలవుతున్న సినిమాలపై తన వ్యక్తిగత అభిప్రాయాలను పరుచూరి పాఠాల వేదికగా వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఆయన…మెగస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’, విక్టరీ వెంకటేష్ నటించిన ‘ఎఫ్-3’, దగ్గుపాటి రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాటపర్వం’ వంటి సినిమాలపై రివ్వూలు చెప్పారు.

తాజాగా ఆయన ‘సీతారామం’ సినిమాపై వెల్లడించిన అభిప్రాయం ప్రస్తుతం తెలుగు, మలయాళ ఇండస్ట్రీలలో హాట్ టాపిక్‌గా మారింది. ‘సీతారామం’ సినిమాను అలా తీసుంటే ఇంకా వేరే లెవెల్లో ఉండేది’ అంటూ మొదలుపెట్టారు. ”హృద్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ విజయం సాధించిన ఈ చిత్రం నాకు బాగా నచ్చింది. విభిన్న పార్శ్వాలను స్పృశించే ప్రేమ, ఆకట్టుకునే యుద్ధ నేపథ్యం, ప్రేక్షకుల మదిలో అలజడి రేపే విషాదాంతంలాంటి అంశాలు ఈ సినిమాను మరుపురాని చిత్రంగా నిలబెట్టాయి.

గతంలో ఇదే నేపథ్యంతో వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుని, కమర్షియల్ గానూ విజయం సాధించాయి. కానీ ‘సీతారామం’ సినిమాను సగటు ప్రేక్షకుడు ఆశించే సుఖాంతానికి తావివ్వకుండా, దర్శకుడు సినిమాని విషాదాంతంగా ముగించడంతో భిన్నమైన ప్రేమకథ చిత్రంగా నిలిచింది. అయితే క్లైమాక్స్‌లో వాళ్లిద్దరూ కలిసినట్లు సినిమాని మార్చి ఉంటే ఇంకా సినిమా వేరే లెవెల్లో ఉండేది. హీరో పాత్రను ప్రశ్నార్థకంగా ముగించేయడం ప్రేక్షకులను కంటతడి పెట్టించింది” అని ఆయన అన్నారు.