If students sit like that in the class..it is a danger to the country
mictv telugu

క్లాస్‌‌ రూమ్స్‌లో అలా కుర్చుంటే..దేశానికే ప్రమాదం

August 29, 2022

కేరళ రాష్ట్ర సీఎం పినరయికి సన్నిహితుడైన వెల్లపల్లి నటేశన్ చేసిన వ్యాఖ్యలు..ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. భారతదేశ సంస్క‌తికి వ్యతేరేకంగా నేటి విద్యాలయాలు, కాలేజీలు, స్కూల్స్ నడుస్తున్నాయని, ప్రస్తుత జనరేషన్‌లో కో-ఎడ్యుకేషన్‌ వల్ల దేశానికి పెను ప్రమాదం ఉందని ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

”క్లాస్‌ రూమ్స్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడానికి మేము మద్దతు తెలపడం లేదు. ఎందుకంటే.. భారతదేశానికి అంటూ ప్రాచీన కాలంగా ఓ సంస్కృతి ఉంది. అమ్మాయిలు, అబ్బాయిలు కౌగిలించుకోవడం, కలిసి కూర్చోవడం వంటి చర్యలను మన సంస్కృతి ఒప్పుకోదు. ఇలాంటిది మన సంస్కృతికి విరుద్ధం. మనమందరం ఇంగ్లండ్‌, అమెరికాలో బ్రతకడంలేదు. 18 సంవత్సరాలలోపు ఉన్న వారు..కళాశాలల్లో చదువుకుంటున్న యువతీ, యువకులు ఒకరినొకరు కలిసి కూర్చుని కౌగిలించుకోకూడదు. ఇలా వారు కలిసి కూర్చోవడం దేశానికే ప్రమాదం. పిల్లలు పెద్దయ్యాక, పరిపక్వత వచ్చిన తర్వాత, వారు కోరుకున్నది చేయగలరు. ఇలా అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చుంటున్న కారణంగానే విద్యార్థులు చదువులో రాణించలేకపోతున్నారు” అని ఆయన అన్నారు.

కేరళలో కీలకమైన ‘హిందూ ఎజావా కమ్యూనిటీ’ నేత, సీఎం పినరయి విజయన్‌కు అత్యంత సన్నిహితుడైన వెల్లపల్లి నటేశన్..తాజాగా కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ ‘జండర్ న్యూట్రల్ పాలసీ’ గురించి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి హాజరైన ఆయన.. విద్యా సంస్థలపై తీవ్రంగా మండిపడ్డారు.