If Team India plays like this, there will be difficulties: Former Pakistan captain
mictv telugu

టీమిండియా ఇలాగే ఆడితే..కష్టాలు తప్పవు: పాక్ మాజీ కెప్టెన్

September 2, 2022

టీమిండియా ఆట తీరుపై పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో భారత జట్టు ప్రస్తుతం ఆసియాకప్‌లో ఆడినట్లు ఆడితే, కష్టాలు తప్పవని అన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న ఆసియాకప్‌లో రోహిత్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని తన మనసులోని పలు విషయాలను వెల్లడించాడు.

తాజాగా మహమ్మద్ హఫీజ్ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ..”హాంకాంగ్ విజయం సాధించిన తర్వాత రోహిత్ శర్శ ముఖకవళికలను నేను పరిశీలించాను. ఈరోజు రోహిత్ బాడీ లాంగ్వేజ్ గురించి చెబుదామని అనుకుంటున్నా.. తొలుత హాంకాంగ్‌ మ్యాచ్ టాస్ వేసేందుకు వచ్చేటప్పుడు రోహిత్ శర్మ బలహీనంగా, అయోమయంగా కనిపించాడు. ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఒంటి చేతితో ఆడిన రోహిత్ శర్మలో ఇదివరకు ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్ నేను ఎప్పుడు చూడలేదు. నాకు తెలిసి కెప్టెన్సీ అతడికి భారంగా అనిపిస్తోందేమో, ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నట్లుంది. ఇక, అతడి ఫామ్ కూడా సరిగ్గా లేదు. భారత టీ20 లీగ్‌లోనూ రాణించలేదు. మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా విషయాల గురించి మాట్లాడుతున్నాడు. కానీ, అవి అతడి బాడీ లాంగ్వేజ్‌లో కనిపించడం లేదు. మాట్లాడటం చాలా తేలిక, చేయడమే చాలా కష్టం. ఇది నా అంచనా కాదు. కానీ, నా అభిప్రాయం ప్రకారం ఎక్కవ కాలం జట్టును రోహిత్ నడిపించలేడు. దీనిపై టీమ్ఇండియా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని హఫీజ్ అన్నారు.

ఇక, కెప్టెన్ రోహిత్ శర్మ విషయానికొస్తే.. గత రెండు మ్యాచుల్లో కేవలం 33 పరుగులు (పాక్‌పై 18 బంతుల్లో 12 పరుగులు, హాంకాంగ్‌పై 13 బంతుల్లో 21 పరుగులు) మాత్రమే చేశాడు. హాంకాంగ్ మీద కాస్త దూకుడుగా ప్రదర్శించినా, పాకిస్థాన్‌పై ఇబ్బంది పడ్డాడు. గతకొన్ని రోజులుగా చర్చంతా విరాట్ కోహ్లి మీదనే ఉండటంతో రోహిత్ ఫామ్ గురించి ఎవరు చర్చించలేదు.

ఈ క్రమంలో రోహిత్ శర్మ వచ్చే ప్రపంచకప్‌లోను..ఇలాంటి ప్రదర్శనే ఇస్తే భారత్‌కు కష్టాలు తప్పవని పాక్ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఆసియాకప్‌లో భారత్ సూపర్-4 దశకు చేరుకున్న విషయం తెలిసిందే.