ఎమ్ఎన్‌సీ కంపెనీలన్నీ ఇప్పుడు టెలిఫోనిక్ ఇంటర్వ్యూలకే ఓటేస్తున్నాయి. దీనిద్వారానే ప్రాథమికంగా వడపోసేస్తారు. ఇందులో చూపే ప్రతిభ ఆధారంగానే తదుపరి రౌండ్ కి అర్హులా? కాదా? అనేది తేలిపోతుంది. ఉద్యోగ ఎంపికల్లో భాగంగా.. సమయాన్ని, వ్యయాన్ని తగ్గించుకోవడానికి టెలిఫోనిక్ పద్ధతిని అవలంబిస్తున్నాయి. అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలవడానికి మేం ఒకసారి ఫోన్ లో వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. వారి ప్రతిభను బట్టి తరువాతి రౌండ్ కి ఎంపిక చేయాలో లేదో తేల్చేసుకుంటారు. మరి ఇంతటి ప్రాముఖ్యం ఉన్న దాంట్లో నెగ్గాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
– అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు మీరు ఆ ఉద్యోగానికి తగిన అభ్యర్థి అనిపిస్తే కాల్ మీకొస్తుంది. అయితే ఫోన్ లో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి.
– ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని మనం చూడలేం. మన సమాధానాలు సరైనవో కావో తెలియాలంటే వారి మాటలే మనకు ప్రతిస్పందనలు. కాబట్టి ఈ సమయంలో మనం ఏం మాట్లాడుతున్నమనే విషయం మీద అప్రమత్తంగా ఉండాలి.
– ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చెప్పే విషయాల్ని నిశితంగా వినాలి. స్పష్టంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే మనం సమాధానాలు తప్పు చేప్పే ప్రమాదం ఉంది. దీనివల్ల మీకు ఆ ఉద్యోగం పట్ల ఆసక్తి లేదేమోనని ఎదుటివారికి అనిపించవచ్చు.
– ఫోన్ ఇంటర్వ్యూ సమయం ముందుగానే తెలియచేస్తారు. కాబట్టి.. ఆ సమయానికి ఫోన్ ని ఫుల్ గా ఛార్జింగ్ పెట్టుకోవాలి. అలాగే చుట్టుపక్కన ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా చూసుకోవాలి.
– ప్రశాంతమైన వాతావరణంలో, ఫోన్ సిగ్నల్స్ స్పష్టంగా ఉండేలా చూసుకోండి. ఇతర పరికరాలు ఏమున్నా ఆ సమయానికి స్విచ్ఛాఫ్ చేయండి. ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా ముందుగానే చెప్పండి.
– ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మనతో మాట్లాడేటప్పుడు ఊ కొట్టడం లాంటివి చేయొద్దు. దీనివల్ల మీ మీద నెగిటివ్ ఫీలింగ్ అవకాశం వస్తుంది. ఒకవేళ అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియకపోతే నిక్కచ్చిగా చెప్పేయండి. సమయం కావాల్సి వస్తే నిరభ్యంతరంగా అడుగేయండి.
– ఫోన్ ఇంటర్వ్యూ ప్రారంభం కాకముందే సర్టిఫికేట్లను, డాక్యుమెంట్లను, ఇతర అవసరమైన పత్రాలను దగ్గర ఉంచుకోవాలి.
– కంప్యూటర్ ద్వారా సమాచార చెప్పే సమాధానాలు కొన్ని ఉంటాయి. కాబట్టి కచ్చితంగా కంప్యూటర్ ఆన్ చేసి పెట్టుకోండి. వీలైతే.. అందులో ముఖ్యమైన ఫోల్డర్లను ఓపెన్ చేసుకోండి.
– ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో మాట్లాడేటప్పుడు లౌడ్ స్పీకర్ ఆన్ చేయవద్దు. వీలైతే హెడ్ ఫోన్ వాడడం ఉత్తమం. దీనివల్ల అవతలి వ్యక్తి చెప్పే మాటలే కాదు.. మనం మాట్లాడే మాటలు కూడా వారికి స్పష్టంగా వినిపిస్తాయి.