ఆ సినిమా హిట్టయ్యుంటే నా కెరీర్ మరోలా ఉండేది : రాజమౌళి - MicTv.in - Telugu News
mictv telugu

ఆ సినిమా హిట్టయ్యుంటే నా కెరీర్ మరోలా ఉండేది : రాజమౌళి

March 24, 2022

rrr

కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు పరాజయం ఎరుగని దర్శకుడిగా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి గారు. దర్శకుడిగా సీరియల్‌తో మొదలుపెట్టి నేడు అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలతో అనేక రికార్డులను తన పేరున లిఖించుకున్నారు. దర్శకుడిగానే కాకుండా నటన మీద మక్కువతో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న సన్నివేశాల్లో నటించారు. కానీ, బాల నటుడిగా ఓ చిత్రంలో నటించిన సంగతి మీకు తెలుసా? ఆయన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమం సందర్భంగా ఆయనే ఈ విషయం గురించి చెప్పారు. 1983 లో వచ్చిన పిల్లన గ్రోవి అనే చిత్రంలో రాజమౌళి నటించారు. అప్పుడు ఆయన వయసు పదేళ్లు. దురదృష్టవశాత్తూ ఆ సినిమా రిలీజ్ కాలేదు. ఒకవేళ రిలీజై , విజయవంతం అయి ఉంటే కెరీర్ మరోలా ఉండేదంటూ చెప్పుకొచ్చారు. కాగా, రేపు విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మీద దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.