కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకం విషయంలో కఠిన చర్యలకు పూనుకుంది. అభ్యర్థులు ఎవరైనా అగ్నిపథ్‌పై వ్యతిరేకంగా గళం విప్పితే, వారికి శాశ్వతంగా ఆర్మీ ఉద్యోగాలకు అర్హులు కాదని అధికారులు తేల్చి చెప్పారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
‘అగ్నిపథ్’పై ఎవరైనా అభ్యర్థులు వ్యతిరేకంగా గళం విప్పితే, వారు ఆర్మీ ఉద్యోగాలకు శాశ్వతంగా అనర్హులు. ఇకపై ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తాజాగా నెలకొన్న హింసాత్మక ఘటనల్లో పాల్గొనలేదు అనే విషయాన్ని స్పష్టంగా ధృవీకరిస్తేనే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలకు అర్హులు. ఇందుకు సంబంధించి దరఖాస్తు సమయంలోనే ప్రమాణ పత్రాన్ని సమర్పించాలి. ఒకవేళ పోలీస్ వెరిఫికేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైందని తేలితే, వారికి అగ్నివీరులుగా ప్రవేశం ఉండదు. 1989 నుంచి అగ్నిపథ్ స్కీం పెండింగ్‌లో ఉంది. దీనిపై ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు” అని అన్నారు.
మరోపక్క ‘అగ్నిపథ్’ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు చోట్లు భారీ సంఖ్యలో యువకులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. దాంతో వేలమంది విద్యార్థులపై పోలీసులు అనేక రకాల కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఈ ప్రకటనతో ఆయా విద్యార్థులు తమ కళలకు, ఉద్యోగానికి శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.