If these symptoms appear in you, then you are suffering from the problem of anemia
mictv telugu

ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా…డౌటే లేదు మీలో రక్తహీనత ఉన్నట్లే..!!

January 25, 2023

If these symptoms appear in you, then you are suffering from the problem of anemia

శరీరంలో ఐరన్ లోపించినట్లయితే  రక్తహీనత సమస్య వస్తుంటుంది. దీన్ని ఎనీమియా అని కూడా అంటారు. మహిళల్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుది. వాళ్లకు నెలసరి సమయంలో రక్తం ఎక్కువగా పోతుంది కాబట్టి వారిలో రక్తహీనత వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో కూడా ఈ వ్యాధి అనేది వస్తుంది.

రక్తహీనత వల్ల ఈ లక్షణలు కనిపిస్తాయి.
రక్తహీనతతో బాధపడేవారు నీరసంగా, కొద్దిదూరం నడవగానే ఆయాసం వస్తుంది. ఏకాగ్రత లోపిస్తుది. చిరాకు, కోపం ఎక్కువగా ఉంటుంది. ఆందోళన ఉంటుంది. చర్మం రంగు మారుతుంది. చర్మం పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. తరచుగా తలనొప్పి, వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జుట్టు రాలిపోవడం, గోర్లు విరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు గుండెకు సరిగ్గా ప్రసరణ జరగక…గుండె పనితీరు కూడా దెబ్బతింటుంది.

పెద్దవారికంటే పిల్లల్లోనే ఎక్కువ శాతం
విటమిన్ బి 12 లోపం, ఐరన్ లోపం, విటమిన్ డి లోపం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. రక్తహీనత ఏర్పడినప్పుడు కాల్షియం సరిగ్గా శోషించుకోకపోవడం వల్ల కాల్షియం, డెఫిషియన్సీ ఏర్పడుతుంది. దీంతో ఎముకలు పెలుసుగా మారుతుంటాయి. అంతేకాదు రక్తహీనత సమస్య ఉంటే పెన్సిళ్లు, పెయింట్, గోడకు రాసిన సున్నం, బల్పాలు తినాలనిపిస్తుంది. తరచు తలనొప్పి వస్తున్నా కూడా అందుకు కారణం రక్తహీనత అయ్యి ఉంటుంది. ఇది పెద్ద వారి కంటే చిన్న పిల్లల్లోనే ఎక్కువ శాతం కనిపిస్తుంది.

ఊపిరితీసుకోవడం కష్టం
రక్తహీనతతో బాధపడేవారు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీలో నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువౌతాయి. నడుస్తున్నా..మెట్లు ఎక్కుతున్నా ఆయాసం వస్తుంది. దీర్ఘకాల వ్యాధులు కూడా హిమోగ్లోబిన్ ఉత్పత్తిని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. కిడ్నీ, వ్యాధులు, టీబీ, సికల్ సెల్ ఎనీమీయా, ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి వ్యాధుల వల్ల కూడా శరీరంలో రక్తం తగ్గుతుంది. వీటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించాలి.

రక్తహీనత తగ్గించటానికి ;
హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి విటమిన్ ఏ, విటమిన్ సి గల ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అందులోను ముఖ్యంగా ఆకుకూరలు, నిమ్మ జాతి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో మన శరీరంలోని రక్తహీనతన సమస్య నుండి బయటపడవచ్చు. ఐరన్‌ ఉండే ఆహారాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా వరకూ విటమిన్‌ బి 12 లోపం, ఐరన్‌ లోపం, విటమిన్‌ డి లోపం వల్ల రక్తహీనత వస్తుంది. అందువల్ల మనం తినే ఆహారంలో ఐరన్, విటమిన్‌ బి 12 ఎక్కువగా ఉంటే రక్తహీనత తొలగిపోతుంది. మేక మాంసం, కోడి మాంసం, చేపలు తినాలి. ఆర్గాన్‌ మీట్స్, లివర్‌లో ఐరన్‌ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని తరచుగా ఆహారంలో చేర్చుకోవాలి. అంతేకాదు బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలు వంటి పదార్థాల్లో కూడా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వీటిని కూడా తరచుగా తీసుకోవడం వల్ల ఎనీమియా నుంచి బయటపడవచ్చు.