‘గాల్వన్లో అమరులైన సైనిక కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వడం తప్పు కాదు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలోనూ తప్పు లేదు. కానీ తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చేయరు? 1,200 మంది అమరులైనారని ఉద్యమంలో గొంతు చించుకున్న మీరు.. అధికారంలోకి వచ్చాక కొందరే అమరులెందుకు అయ్యారు కేసీఆర్’ అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు.
జార్ఖండ్ రాష్ట్రంలో కేసీఆర్ శుక్రవారం పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్, జార్ఖండ్ సీఎంతో కలిసి చైనా భారత్ మధ్య జరిగిన గాల్వన్లో అమరులైనా సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద చెక్కులు అందజేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా స్పందించారు.
గాల్వన్ లో అమరులైన సైనిక కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వడం తప్పు కాదు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలో తప్పు లేదు. కానీ
తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చేయరు? 1200 మంది అమరులని ఉద్యమంలో గొంతుచించుకున్న మీకు అధికారంలోకి వచ్చాక కొందరే అమరులెందుకయ్యారు?1/2— YS Sharmila (@realyssharmila) March 4, 2022
‘నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న వందల మంది నిరుద్యోగులను ఎందుకు ఆదుకోరు?. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న వేల మంది రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోరు?. కనీసం నష్టపోయిన పంటకు పరిహారం ఎందుకివ్వరు?. సొంత రాష్ట్రం వారిని అల్లం, బయటి వారిని బెల్లం చేసుకోవడమేనా బంగారు భారత్కు బాట?’ అంటూ వైఎష్ షర్మిల సీఎం కేసీఆర్పై సంధించారు.