హిందూ మతంలో, వారంలోని ఒక్కో రోజు..ఒక్కో దేవుడికి అంకింతం చేయబడింది. అదేవిధంగా, గురువారం విష్ణువును పూజించడానికి అనుకూలమైన రోజు. ఈ రోజు విష్ణుమూర్తిని పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతుంటారు. అంతేకాదు గురువారం రోజు విష్ణువుతో పాటు తులసిని కూడా పూజిస్తారు.
విష్ణుమూర్తితోపాటు తులసికి పూజ:
తులసి విష్ణువుకు ప్రీతికరమైనది. విష్ణుపూజలో తులసిని కూడా తప్పకుండా పూజిస్తారు. అలాగే ప్రతి ఇంట్లోనూ తులసిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. తులసిని పూజించడం వలన విష్ణువు ప్రసన్నుడవుతాడు భక్తుల నమ్మకం. విష్ణువును, తులసిని పూజించే ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యానికి, ఆనందానికి లోటు ఉండదని చాలా మంది నమ్మకం.
గురువారం పొద్దున్నే ఇలా చేయాలి:
గురువారం పొద్దున్నే లేచి తలస్నానం చేసి తులసికి పచ్చి పాలు నైవేద్యంగా పెట్టాలి. దీంతో విష్ణువు సంతోషించాడు. అదేవిధంగా సాయంత్రం పూట తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల తులసి తల్లి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. తులసిని లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు. అందువలన, తులసి పూజ ఆ ఇంట్లో ఆనందం, శాంతి, ప్రశాంతత, శ్రేయస్సును కలిగిస్తుందని నమ్ముతారు. చాలా మంది గురువారం కూడా ఉపవాసం ఉంటారు.
పసుపు బట్టలు ధరించాలి:
అదేవిధంగా, మీరు గురువారం ఉపవాసం ఉన్నట్లయితే, ఆ రోజు తులసిని పూజించేటప్పుడు పూజ సమయంలో పసుపు బట్టలు ధరించడం మంచిది. తులసిని భక్తితో పూజిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. తులసి మొక్కను ఇంటికి తీసుకురావడానికి గురువారం కూడా శుభప్రదంగా భావిస్తారు. దీనితో పాటు ఈ రోజు అరటి మొక్కకు నీరు పోస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని నమ్మకం. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ధన, ధాన్యాల సమస్య ఉండదని చాలా మంది నమ్ముతుంటారు.