మాకు ఓటు వేయకపోతే తెలంగాణను ఆంధ్రలో కలుపుతాం.. - MicTv.in - Telugu News
mictv telugu

మాకు ఓటు వేయకపోతే తెలంగాణను ఆంధ్రలో కలుపుతాం..

February 24, 2018

నాయకులు నోటికేదొస్తే అది మాట్లాడేస్తున్నారు.. ప్రజలను మభ్య పెడుతున్నారు.. అలాగే ప్రజలను తికమకకు కూడా గురి చేస్తున్నారనటానికి ఈయనగారి మాటలే అందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. ‘ మాకు ఓటు వేయకపోతే తెలంగాణను ఆంధ్రలో కలిపేస్తాం ’ అంటూ కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన రైతు భరోసా యాత్ర బహిరంగ సభలో బలరాం నాయక్ మాట్లాడుతూ ‘ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేస్తాం ’ అని అన్నారు.ఆయన ప్రసంగిస్తున్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు అక్కడే వున్నారు. కాగా బలరాం నాయక్ వ్యఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజనులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ ఇంకా నయం భారతదేశాన్ని తీసుకెళ్ళి పాకిస్తాన్‌లో కలుపుతానని అనలేదు.. ఆయన ప్రజలను బెదిరిస్తున్నాడా.. లేక ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడో అర్థం కాకుండా వుంది ? ’ అంటూ  సెటైర్లు వేస్తున్నారు.