తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్‌కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులు కోచింగ్ సెంటర్లు, గ్రంథాలయాలకు బారులు తీరుంటారు. హడవుడితో..టెన్షన్ పడుతూ ప్రిపరేషన్ ప్రారంభిస్తారు. అయితే మనలో చాలామంది అభ్యర్థులు ఎలాంటి పుస్తకాలు ఎంచుకోవాలి..ఎలాంటి మెటీరియల్ సెలక్ట్ చేసుకోవాలో తెలియక టెన్షన్ పడుతుంటారు. మార్కెట్లో ఒక్కో సబ్జెక్టుకు పదుల సంఖ్యలో పుస్తకాలు ప్రచురించి ఉంటాయి. దీంతో ఏ పుస్తకం కొనాలి…ఏ పుస్తకంలో ఎలాంటి సమాచారం ఉంది..దాన్ని ఎలా చదవాలి..సిలబస్ కు అనుగుణంగా సొంతంగా నోట్స్ ఎలా రాసుకోవాలి..ఇలా ఎన్నో సందేహాలు వారిని ఒత్తిడికి గురిచేస్తుంటాయి. ఇలాంటి క్లీష్ట సమయంలో గ్రూప్స్ పరీక్షలకు ప్రీపేరయ్యే అభ్యర్థులు సొంతంగా నోట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
సొంతగా నోట్స్ తయారు చేసుకునే టిప్స్:
పోటీ పరీక్షలకు ప్రీపేర్ అయ్యే అభ్యర్థులు సొంతంగా నోట్స్ రాసుకునే విధానాన్ని పాటించాలి. ఎందుకంటే ఇది వారికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు, విజేతలు చెబుతున్నారు. ఈ సొంత నోట్స్ రాసుకునే విధానంలో కూడా అభ్యర్థులు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి అభ్యర్థులు ఏదైనా అంశాన్ని చదువుతున్న సమయంలో ముందుగా వాటి ప్రాథమిక భావనలు నోట్స్ లో రాసుకోవాలి. తర్వాత వాటిని సమకాలీన అంశాలతో అనుసంధానిస్తూ..తగిన సమాచారాన్ని సదరు నోట్స్ లో రాసుకోవడం మంచిది.
క్లాస్ రూమ్ స్టడీ నోట్స్ :
నోట్స్ రూపొందించుకోవడంలో ఇది ముఖ్యమైన విధానం. అభ్యర్థులు ఒక సబ్జెక్టుకు సంబంధించి క్లాస్ రూములో లెక్షర్ వింటున్న సమయంలో ముఖ్యమైన పాయింట్స్ రాసుకోవాలి. ఇవి పోటీ పరీక్షల సమయంలో చాలా ఉపయోగపడతాయి.
ప్రిపరేషన్ సమయంలో స్టడీ నోట్స్ :
సొంతంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పలు పుస్తకాల ద్వారా సేకరించే సమచారం స్టడీ నోట్సలో రాసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అభ్యర్థులు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను చదువుతున్న సమయంలో రన్నింగ్ నోట్సులా రాసుకోవాలి. ఆయా టాపిక్స్ సంబంధించిన నిర్వచనం, ఫార్ములాలు, భావనలు రాసుకోవాలి.
కలరింగ్ మెథడ్ :
అభ్యర్థులు నోట్స్ లో రాసుకునే ముఖ్యమైన అంశాలపై కలర్ పెన్స్ తో హైలెట్ చేసకోవాలి. ఎందుకంటే రివిజన్ సమయంలో సులభంగా చదువుకునే వీలుంటుంది. కలరింగ్ మెథడ్ కు రెండు లేదా మూడు రంగుల పెన్నులను వాడాలి. రెడ్ కలర్ హెడ్డింగ్, గ్రీన్ కలర్ కీలకమైన పాయింట్స్, పింక్ నిర్వచనాలకు ఉపయోగించాలి.
మైండ్ మ్యాపింగ్ :
ఇది మరో ముఖ్యమైన విధానం. ఆయా అంశానికి సంబంధించి విజువలైజేషన్ టెక్నిక్ ను అనుసరించాల్సి ఉంటుంది. సదరు టాపిక్ కు సంబంధించి తమకు అనువైన రీతిలో సింబల్స్, లైన్స్, గ్రాఫ్స్ ను రూపొందించుకోవాలి.
టేబుల్ ఫార్మట్:
ఈ టేబుల్ ఫార్మట్ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక అంశానికి సంబంధించిన విషయాలు ఒకే సారి గుర్తుతెచ్చుకునే విధానం లేదా పునశ్చరణకు ఉపయోగపడే విధానం ఇది. ఈ ప్యాట్రన్ మెథడ్ లో స్టడీ నోట్స్ రాసుకుంటే..నిర్దిష్ట అంశాన్ని పేపర్ మధ్యలో ఒక సర్కిల్లో రాసుకోవాలి. ఆ తర్వాత అంశానికి సంబంధించిన అనుబంధ పాయింట్లను లైన్స్ రూపంలో రాసుకోవాలి.
చార్టుల రూపంలో :
చార్టులరూపంలో నోట్స్ రాసుకుంటే…ఆయా సబ్జెక్టులకు సంబంధించి ముఖ్యాంశాలను పొందుపర్చుకోవచ్చు. ఒక పేజీ లేదా రెండు మూడు వరుసల్లో ఒక టాపిక్ కు సంబంధించి ముఖ్యాంశాలను మొదటి వరుసలో…దానికి సంబంధించి కాన్సెప్ట్ లు, ఫార్ములాలను రెండో వరసలో రాసుకోవాలి. రివిజన్ సమయంలో టాపిక్ ఉద్దేశం మొదలు సమకాలీన పరిస్థితుల వరకు అన్నింటిని సులభంగా గుర్తు తెచ్చుకోవచ్చు.
డయాగ్రమ్స్ -అబ్రివేషన్స్ :
ఈ డయాగ్రమ్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు అనువైన డయాగ్రామ్ ను రూపొందించుకోని…ఆ తర్వాత అందులో ముఖ్యభాగాల రూపంలో సదరు టాపిక్ కు సంబంధించిన ముఖ్య అంశాన్ని సబ్ టాపిక్స్ రాసుకోవాలి. అబ్రివేషన్స్ కూడా చాలా ముఖ్యం.
సాంకేతిక పదాలు:
స్టడీనోట్సులో అభ్యర్థులు సాంకేతిక పదాలను రాసుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు కొన్ని పదాలు ఉంటాయి. ఎనామిక్స్ లో రెపో రేటు, రివర్స్ రేపోరేటు. జాగ్రఫీలో గ్లేసియర్స్, బ్యాడ్ ల్యాండ్స్ వంటివి ఉంటాయి. వీటిని నోట్సులో పొందుపర్చుకోవాలి. వాటిని అర్థాన్ని, నిర్వచనాన్ని రాసుకుంటే అవగాహన ఉంటుంది.
చదువుతుండగానే నోట్స్ రాసుకోవాలి:
ఒక టాపిక్ గురించి చదువుతున్నప్పుడు ముఖ్యమైన పాయింట్స్ నోట్స్ లో రాసుకోవాలి. ఎందుకంటే ఒక టాపిక్ ను పదే పదే చదవాల్సిన అవసరం ఉండదు. మళ్లీ చదవాల్సి వచ్చినప్పుడు ఈ ముఖ్యమైన పాయింట్స్ చదవుకుంటే సరిపోతుంది.
నీట్ గా నోట్స్ రాసుకోవాలి:
స్టడీ నోట్స్ రాసుకునేటప్పుడు నీట్ గా రాసుకోవాలి. రైటింగ్ కూడా చక్కగా ఉండాలి. ప్రతి పేజీలో ఒక అంశానికి సంబంధించి గ్యాప్ ఇవ్వాలి. రివిజన్ సమయంలో సులభంగా ఉంటుంది. అంకిత భావంతో ప్రిపరేషన్ సాగిస్తే..పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.