మార్కెట్లో తమ వస్తువులు అమ్ముడుపోవడానికి యజమానులు అనేక రకాల ఆఫర్లు ఇస్తుంటారు. కానీ, నథింగ్ ఫోన్ యజమాని ఇస్తున్న ఆఫర్ మాత్రం ఇప్పటివరకు ఎవరూ ఇవ్వలేదని చెప్పవచ్చు. కేవలం ట్విట్టర్ లో కామెంట్ చేస్తే నథింగ్ ఫోన్ ఉచితంగా మీ సొంతం చేసుకోవచ్చు. నథింగ్ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పనితీరు, ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో పాపులర్ అయ్యింది. అయితే నథింగ్ ఫోన్ ఫౌండర్ కార్ల్ పి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ట్విట్టర్ లో నడుస్తున్న ఓ కాంటెస్ట్ లో కేవలం ట్వీట్ చేస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో వెల్లడించారు. ఆయనకు కామెంట్ చేసిన తర్వాత మీ కామెంటును ఎవరూ లైక్ చేయకపోతే మీకు నథింగ్ ఫోన్ 1 ఉచితంగా అందిస్తారు.
అలాగే ఎక్కువ లైక్స్ వచ్చిన కామెంటుకి కూడా ఫ్రీగా ఫోన్ ఇస్తారు. దీంతో ఎవరైనా ఈ పోటీలో పాల్గొని గెలిచే అవకాశముంది. అయితే ఇది కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చేసిన ప్రతీ కామెంటుకి ఇప్పటివరకు లైక్స్ వచ్చాయి. దీంతో ఎక్కువ లైక్స్ వచ్చిన కామెంటుకి ఫోన్ ఫ్రీగా ఇవ్వనున్నారు. ఈ టాస్క్ 24 గంటల్లో ముగుస్తుంది కాబట్టి తొందరపడమని కార్ల్ పి చెప్తున్నారు. కాగా, మూడు వేరియంట్లలో లభించే నథింగ్ ఫోన్ ధర రూ. 27,499 నుంచి ప్రారంభం అవుతోంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ మెమొరీ ఉంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమొరీకి రూ. 30, 499గా ఉంది. దీంతో పాటు ఫౌండర్ మరో గుడ్ న్యూస్ అందించారు. ఈ ఫోన్లలో తొలిసారిగా గూగుల్ పర్సనల్ సేఫ్టీ సూట్ యాప్ ఉండనుంది. ఇప్పటివరకు ఈ సౌకర్యం పిక్సెల్ ఫోన్లలోనే అందుబాటులో ఉంది. ఇటీవలే యాపిల్ తన ఐఫోన్లలో ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టింది.