పవన్‌కు దమ్ముంటే అక్కడ పోటీ చేయాలి.. వైసీపీ సవాల్ - MicTv.in - Telugu News
mictv telugu

పవన్‌కు దమ్ముంటే అక్కడ పోటీ చేయాలి.. వైసీపీ సవాల్

May 9, 2022

వైసీపీ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఓ సవాల్ విసిరారు. ‘దమ్ముంటే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసి గెలవాలి’ అంటూ ఛాలెంజ్ చేశారు. హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. ”రెండుచోట్ల పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన పవన్‌ కళ్యాణ్‌కు ప్రజా సంక్షేమ పాలనపై విమర్శించే అర్హత లేదు. రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే, రాయలసీమలో పవన్ పర్యటిస్తున్నాడు. పవన్‌కు నిజంగా ప్రజా బలం ఉంటే కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమను. కర్నూలు నుంచి గనుక పోటీచేస్తే, గోదావరి జిల్లాల కంటే ఘోరంగా ఇక్కడి ప్రజలు ఓడిస్తారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నాడు” అని ఆయన అన్నారు.

మరోపక్క గతకొన్ని రోజులుగా టీడీపీ, జనసేన మళ్లీ ఒక్కటికానున్నాయని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చలు జరిపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అటు చంద్రబాబుపై ఇటు పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడుతూ, సవాల్ విసురుతున్నారు. ఎన్ని ప్రణాళికలు వేసిన, రెండు పార్టీలు ఒక్కటైనా జగన్ మోహన్ రెడ్డి ఓడించలేరంటూ, వైసీపీ ఎమ్మెల్యేలు ఛాలెంజ్‌లు చేస్తున్నారు.