If you do not like it, leave it .. Who will join: VK Singh
mictv telugu

నచ్చకపోతే మానేయండి..ఎవరు చేరమన్నారు: వీకే సింగ్

June 20, 2022

If you do not like it, leave it .. Who will join: VK Singh

‘అగ్నిపథ్’ నిరసనకారులపై కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. ”కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం నచ్చకపోతే ఆర్మీలో చేరటం మానేయండి. అగ్నిపథ్‌లో చేరమని మిమ్మల్ని ఎవరు బలవంతపెడుతున్నారు. బస్సులు, రైళ్లు ఎందుకు తగలబెడుతున్నారు. మీ అందరినీ అగ్నిపథ్‌లోకి తీసుకుంటామని ఎవరు చెప్పారు. మీకు సైన్యంలో చేరే అర్హతలు ఉన్నప్పుడే తీసుకుంటారు. 1999 యుద్ధం తర్వాత కార్గిల్ కమిటీ వేసినప్పుడు ఈ అగ్నిపథ్ పథకం ఆలోచన వచ్చింది. అందుకే తీసుకొచ్చాం. ఈ పథకం నచ్చకపోతే దానిని ఎంచుకోకండి. భారత సైన్యంలో సైనికులుగా చేరమని ప్రభుత్వం బలవంతం చేయదు. ఔత్సాహికులు మీకూ ఇష్టం ఉంటే చేరవచ్చు” అని ఆయన అన్నారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మట్లాడుతూ, ప్రభుత్వ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారుల విషయంలో ఆగ్రహించారు. అగ్నిపథ్ పథకం ఎందుకు తీసుకొచ్చారు? అనే విషయాన్ని సవివరంగా చెప్పారు. విద్యార్థులకు ఈ పథకం నచ్చకపోతే ఈ మార్గాన్ని ఎంచుకోవద్దని స్పష్టతనిచ్చారు.

మరోపక్క ‘అగ్నిపథ్’ పథకం విషయంలో ఎవరైనా అభ్యర్థులు వ్యతిరేకంగా గళం విప్పితే, వారు ఆర్మీ ఉద్యోగాలకు శాశ్వతంగా అనర్హులని అధికారులు తేల్చి చెప్పారు. ఇకపై ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తాజాగా నెలకొన్న హింసాత్మక ఘటనల్లో పాల్గొనలేదు అనే విషయాన్ని స్పష్టంగా ధృవీకరిస్తేనే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలకు అర్హులని అన్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు సమయంలోనే ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని, ఒకవేళ పోలీస్ వెరిఫికేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైందని తేలితే, వారికి అగ్నివీరులుగా ప్రవేశం ఉండదని ఆదేశాలు జారీ చేశారు.