If you do this business, you have a chance to earn a lakh per month in your hometown..!
mictv telugu

ఈ బిజినెస్ చేస్తే మీరు ఉన్నఊరిలోనే, నెలకు లక్ష తగ్గకుండా ఆదాయం సంపాదించే చాన్స్..!

January 19, 2023

ఉద్యోగం కోసం ఎదురుచూసి ఎదురుచూసి అలసిపోయారా అయితే ఇక ఏమాత్రం ఎదురు చూడవద్దు. వ్యాపారం చేయాలనుకునే వారికి ప్రస్తుత కాలంలో అనేక అవకాశాలు ఉన్నాయి మీరు కూడా ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటే సరిపోతుంది తద్వారా ఉన్న ఊరిలోనే చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.

సిమెంట్ డీలర్ షిప్:
ప్రస్తుతం నిర్మాణరంగం జోరు మీద ఉంది నిర్మాణరంగంలో సిమెంట్ కున్న డిమాండ్ కు సంగతి అందరికీ తెలిసిందే. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాలు ఏర్పడినప్పటి నుంచి జిల్లా కేంద్రంగా నిర్మాణరంగం పుంజుకుంటుంది. కొత్త కొత్త కట్టడాలు, అపార్ట్మెంట్లు, గృహ సముదాయాలు, విల్లాలు ఏర్పడుతున్నాయి. వీటి నిర్మాణానికి కావాల్సింది ప్రధానంగా సిమెంటు, కావునా మీరు సిమెంట్ వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. సిమెంట్ డీలర్ షిప్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

ప్రస్తుత మార్కెట్లో అనేక సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. ఎసిసి సిమెంట్, భారతి సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ ఇలా పలు కంపెనీల సిమెంట్ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. కావున మీరు ఎంపిక చేసుకున్న పట్టణం లేదా నగరంలో నిర్మాణాలు జోరందుకుంటున్న ప్రదేశంలో సిమెంటు షాపు పెట్టుకోవాలి. పలు కంపెనీలు డీలర్ షిప్ ప్రాతిపదికన తమ బ్రాండ్ సిమెంట్ అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తుంటాయి. మీరు కూడా ఏదైనా ఎంపిక చేసిన ప్రముఖ సిమెంట్ బ్రాండ్ నుంచి డీలర్ షిప్ పొందవచ్చు. ఒక్కో కంపెనీ తమ డీలర్ షిప్ ఇచ్చేందుకు డబ్బు వసూలు చేస్తూ ఉంటాయి. కంపెనీ నిబంధనలను ప్రకారం డిపాజిట్ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా వారి బ్రాండ్ విక్రయించేందుకు అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు డీలర్ షిప్ పొందవచ్చు.

సిమెంట్ డీలర్ షిప్ పొందిన అనంతరం షాపు ఏర్పాటు చేసుకోవాలి. గోడౌన్ షాపు దగ్గర ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సరుకు త్వరగా కష్టమర్ కు ఇచ్చేందుకు వీలవుతుంది. సిమెంటుతో పాటు నిర్మాణ రంగానికి అవసరమైన ఇతర సామాగ్రి కూడా అందుబాటులో ఉంచుకోవాలి. అప్పుడు మీకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఇక స్థానికంగా ఉండే మేస్త్రీలు సివిల్ ఇంజనీర్లు నిర్మాణ రంగానికి సంబంధించిన సంస్థలతో సత్సంబంధాలను పెట్టుకోవాలి. అప్పుడే మీకు ఆర్డర్లు వస్తాయి.

సిమెంట్ డీలర్ షిప్ విషయంలో కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోరాదు. అదే సమయంలో మార్కెట్లో పోటీని తట్టుకొని నిలవాలంటే కొన్ని మార్కెటింగ్ టెక్నిక్స్ కూడా పాటించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ రంగంలో మీరు నిలదొక్కుకుంటారు సిమెంట్ డీలర్ షిప్ విషయంలో నాణ్యమైన బ్రాండ్ ను ఎంపిక చేసుకోవాలి అప్పుడే మీ సేల్స్ వేగంగా సాగుతాయి. అవసరమైన లేబర్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలి. స్థానిక పర్మిషన్లు మున్సిపాలిటీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జిఎస్టి నెంబర్ పొందాలి.

మీ వ్యాపారం జోరుగా ఉంటే సిమెంట్ రంగం నుంచి చక్కటి ఆదాయం పొందవచ్చు. నిర్మాణరంగం ఎంత పుంజుకుంటే మీ వ్యాపారం కూడా అంత విస్తరిస్తుంది. వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఒక్కోసారి మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే మీ తలకు చుట్టుకుంటాయి. కావున జాగ్రత్తగా వ్యవహరిస్తూ క్రమశిక్షణతో ఉంటే ఈ రంగంలో మీరు పూర్తిగా రాణించవచ్చు.