If you don't use Telugu in AP..in jail
mictv telugu

ఏపీలో తెలుగును వాడకపోతే..ఇక జైలుకే

August 29, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రభుత్వ శాఖల్లో తెలుగును వాడకపోతే, జైలు శిక్ష విధిస్తామంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, ‘ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార’ సంస్థను కూడా ఏర్పాటు చేస్తూ, ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. పాలనా భాషగా తెలుగును అమలుపర్చని అధికారులపై, వ్యవస్థలపై జరిమానా, జైలు శిక్ష విధించే అధికారం కూడా ఉంటుందని.. అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ తెలిపారు. దుకాణాలపై తెలుగులో పేర్లు రాయకపోయిన జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.

తాజాగా జాతీయ విద్యా విధానం కూడా మాతృభాషలో విద్యను నేర్పించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేసింది. కానీ, ఏపీలో తెలుగు మీడియంను రద్దు చేయడం కోసం ఏకంగా సీబీఎస్‌ఈ విధానాన్నే అమలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో.. ”ఏ రాష్ట్రంలోనైనా మాతృభాషను ప్రాణంగా చూసుకుంటారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్య సాగేలా చర్యలు తీసుకుంటారు. కానీ, ఏపీలో మాత్రం అసలు మాతృభాషను మృతభాషగానే చూడటం లేదు. ప్రాథమిక స్థాయిలో విద్యను నేర్పకుండా, ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వాలి, బోర్డులు తెలుగులో పెట్టాలి, అని జీవోలిస్తున్నారు. ఇలాంటి ఉత్తర్వులు నిబంధనలు గతంలోనే ఉన్నాయి. కానీ, ఎవరు పాటిస్తున్నారు? ఎవరు పట్టించుకుంటున్నారు?” అని పలువురు స్థానికులు, నిపుణులు చర్చించుకుంటున్నారు.