If you drink water after drinking tea and coffee, there will be problems
mictv telugu

టీ, కాఫీ తాగాకా వాటర్ తాగితే ఇబ్బందులే..

November 19, 2022

మానవ జీవితంలో టీ, కాఫీలు భాగమైపోయాయి. టీ లేదా కాఫీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. మూడు పూట్ల తీసుకునే ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో టీ, కాఫీలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. అవి లేకపోతే ఏదో మిస్సయిన ఫీలింగ్ ఇబ్బంది పెడుతుంది. ఇంకొందరికి తలనొప్పి కూడా వచ్చేస్తుంది. అయితే ఇవి లిమిట్ దాటితే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా టీ, కాఫీ తాగిన వెంటనే నీళ్లు తాగే అలవాటు మానుకోవాలని సూచిస్తున్నారు. వేడి టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే శరీరంలోని వివిధ భాగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు. దీనివల్ల దంతాల మీదున్న ఎనామిల్ పొర దెబ్బతింటుందని హెచ్చరించారు. టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం వల్ల అల్సర్, ఎసిడిటీ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటివి కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. టీ తాగిన తర్వాత నీటిని తాగడానికి బదులుగా టీ తాగే ముందే నీటిని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.