పోషకాలు అధికంగా ఉండే పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాండి పండ్లలో కివీ కూడా ఒకటి. ఈ పండు చైనాకు చెందినది. కానీ, దాని ప్రజాదరణ, పోషకాల కారణంగా, ఇప్పుడు వాటిని భారతదేశంతో సహా అనేక ఇతర దేశాలలో పండిస్తున్నారు. కివీని పొట్టుతో పాటు తినొచ్చు. వేసవిలో కివీ తింటే బొలెడన్నీ ప్రయోజనాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే ఎన్నో పోషకాలు ఈ కివీలో ఉన్నాయి. కివిలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. అలాగే శరీరంలో రక్తం గడ్డకట్టే సమస్య ఉండదు. దీని వల్ల స్ట్రోక్, కిడ్నీ, గుండెపోటు సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
పోషకాలతో కూడిన కివీని, ప్రతిరోజూ తీసుకుంటే, అది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పని చేస్తుంది. ఒక కివిలో 84 mg విటమిన్ సి ఉంటుంది. అంతే కాకుండా విటమిన్ కె కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. కివీలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి, కాబట్టి ఫిట్‌నెస్ ఔత్సాహికులు కివీని తినడానికి ఇష్టపడతారు. కివిలో ఉండే విటమిన్లు, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. కివిలో ఉండే ఫైబర్ సాధారణ, ఆరోగ్యకరమైన జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కివీ పండు తినడం వల్ల కలిగే 3 ప్రయోజనాలు
మధుమేహం:
కివీ ప్రతిరోజూ తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుంది. రక్తంలో చక్కెరను తగ్గించడానికి మధుమేహ రోగులకు కివి మంచి ఎంపిక.
గుండె కోసం:
కివి గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే, ఫైబర్, విటమిన్లు ఇందులో ఉంటాయి. ఇది ధమనులను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది, తద్వారా మీ ధమనులు బాగా పని చేస్తాయి.
మలబద్ధకం:
మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో కూడా కివి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే, ఇందులో పీచుతో పాటు కోలన్ క్లెన్సింగ్ గుణాలు కూడా ఉన్నాయి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల మలబద్ధకం, పొట్ట సంబంధిత సమస్యలు దూరమవుతాయి.