If you have bank work, get it done as banks may be closed
mictv telugu

బ్యాంకు పనులు ఉంటే ఇప్పుడే పూర్తి చేసుకోండి..ఎందుకంటే..!!

January 17, 2023

ఈనెలాఖరులో బ్యాంకుల సమ్మె కారణంగా నాలుగు రోజుల పాటు బ్యాంకులన్నీ మూతపడే ఛాన్స్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీకు బ్యాంకుల్లో ఏవైన పనులను ఉన్నట్లయితే…ఆ పనులన్నీ ముందుగానే చేసి పెట్టుకోండి. యాజమాన్యం హామీ ఇచ్చినా పెండింగ్ లో ఉన్న డిమాండ్ లపై సానుకూల చర్యలు తీసుకునేందుకు UFBU జనవరి 30-31 తేదీల్లో అఖిల భారత బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చినట్లు సమాచారం.

కాగా బ్యాంకు ఉద్యోగులు 6 డిమాండ్లపై సమ్మెకు దిగనున్నారు. అలాంటి పరిస్థితుల్లో జనవరి 26, 31 మధ్య తేదీల్లో బ్యాంకు జనవరి 27న మాత్రమే తెరచి ఉంటుంది. బ్యాంకు ఖాతాదారులు తమ ముఖ్యమైన పనిని జనవరి చివరి వారంలోపు పూర్తి చేసుకోవడం మంచిది. లేదంటే వరుసగా బ్యాంకు మూసివేత కారణంగా..సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

జనవరి 26 నుంచి 31వరకు మూసివేసే అవకాశం.:
జనవరి 26న రిపబ్లిక్ డే సెలవు, 27 బ్యాంకు తెరచి ఉంటుంది. 28న నాలుగవ శనివారం సెలవు ఉంటుంది. జనవరి 30,31 తేదీల్లో బ్యాంకుల సమ్మె ఉంది. 27వ తేదీ తర్వాత వరుసగా 4 రోజులు బ్యాంకులు మూతపడే ఛాన్స్ ఉంది.

అటు వాణిజ్య బ్యాంకుల్లో పనిచేస్తున్న 9మంది అధికారులు ఉద్యోగుల సంఘం సంయుక్త ఫోరమ్ ఇచ్చిన పిలుపు మేరకు స్టేట్ బ్యాంక్ తోపాటు అన్ని ఇతర బ్యాంకర్లు కూడా సమ్మెలో పాల్గొనున్నారు. అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డీఎన్ త్రివేది ఈ వివరాలు వెల్లడించారు. బ్యాంకింగ్, పెన్షన్ అప్ డేషన్, ఎన్ పీఎస్ కు బదులుగా పాత పెన్షన్ అమలు చేయడం, వేతన సవరణ, అన్ని కేడర్లలో తగిన రిక్రూట్ మెంట్ వంటి డిమాండ్ లతో సమ్మెకు దిగుతున్నట్లు చెప్పారు. ఈ సమ్మెను విజయవంతం చేసేందుకు అన్ని సంఘాలు ముమ్మరంగా సన్నాహాలు ప్రారంబించినట్లు తెలిపారు. సమ్మె తర్వాత సానుకూల స్పందన రాకుండా పోరాటాన్నీ మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ బ్యాంకుల సమ్మే పర్యవసానాలను ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని హెచ్చరించారు.