పాన్ కార్డు అనేది ఈరోజుల్లో చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ఆర్థికపరమైన లావాదేవీలు చేయాలంటే ఇప్పుడు పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆదాయపు పన్ను శాఖకు ఆన్ లైన్ లేదా, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఈ 10 అంకెల సంఖ్య గల పర్మినెంట్ అకౌంట్ నెంబర్ పొందవచ్చు. అయితే ఎంతో కీలకమైన ఈ పాన్ కార్డు పోయినట్లయితే ఎలా. ఏవిధంగా తిరిగి పొందాలి. అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పాన్ కార్డు ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలంటే ?
– ముందు TIN-NSDLఅధికారిక వెబ్ సైట్లోకి వెళ్లాలి.
-తర్వాత అప్లికేషన్ విధానాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పాన్ కార్డులో మార్పులు, చేర్పులను అప్ డేట్ చేయడం లేదా రీ ప్రింట్ పాన్ కార్డు ఆప్షన్ ఎంచుకోవాలి.
-పేరు, పుట్టినతేదీ, మొబైల్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి.
-తర్వాత సబ్ మిట్ బటన్ నొక్కండి.
-ఇప్పుడు టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ టొకెన్ అప్లికెంట్ రిజిస్టర్డ్ ఈమెయిల్ కు వస్తుంది.
-మీకుసంబంధించిన వివరాలన్నింటిని నమోదుచ చేసిన తర్వాత అప్లికేషన్ ఫాం సబ్ మిషన్ విధానాలను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
-మూడు రకాల అప్లికేషన్ ఫాం ఉంటాయి. నేరుగా వెళ్లి డాక్యుమెంట్లు సమర్పించడం, ఈకేవైసీ ద్వారా డిజిటల్ గా డాక్యుమెంట్లు ఇవ్వడం లేదా ఇ సైనింగ్ ద్వారా సబ్ మిట్ చేయడం.
– మీరు నేరుగా ఐటీ ఆఫీసుకు వెళ్లి డాక్యుమెంట్లు సమర్పించాలనుకుంటే.. అప్లికేషన్ పేమెంట్ చేసిన అనంతరం మీకు ధ్రువీకరణ పత్రం జనరేట్ అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, ఓటర్ ఐడీ, బర్త్ సర్టిఫికేట్, పాస్‌పోస్ట్, ఎస్ఎస్ఈ సర్టిఫికెట్ వంటి వాటిపై సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.
– వాటిని ఎన్ఎస్‌డీఎల్‌కు రిజిస్టర్ట్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. దానిపై ధ్రువీకరణ పత్రం నంబర్, అప్లికేషన్ ఫర్ పాన్ రీప్లింట్ వంటివి ఎన్వలాప్‌పై రాయాలి.
– ఈ-కేవైసీ ద్వారా డిజిటల్‌గా డాక్యుమెంట్లు సమర్పించాలనుకుంటే.. ఈ సర్వీస్‌ను పొందడానికి ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. మీరు ఇచ్చిన సమచారాన్ని ధ్రువీకరించేందుకు ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. చివరగా ఫాం సబ్‌మిట్ చేసేటప్పుడు డిజిటల్ సిగ్నేచర్ అవసరం అవుతుంది.
– మీరు తప్పనిసరిగా ఫిజికల్ పాన్ కార్డ్ లేదా ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్ ఈ రెండింటిలో ఏది కావాలో ఎంచుకోవాలి. ఈ-పాన్ కార్డ్ కోసం వాలిడ్ ఈమెయిల్ ఐడీ తప్పనిసరిగా నమోదు చేయాలి. కాంటాక్ట్ వివరాలు, డాక్యుమెంట్ సమచారం అందించి సబ్‌మిట్ చేయాలి.
-15-20 వర్కింగ్ డేస్‌లో మీకు కొత్త పాన్ కార్డ్ వస్తుంది.