మీ ఖాతాలో డబ్బులు పోతే..వెంటనే ఇలా చేయండి - MicTv.in - Telugu News
mictv telugu

మీ ఖాతాలో డబ్బులు పోతే..వెంటనే ఇలా చేయండి

July 1, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను అదుపు చేసేందుకు పోలీసు అధికారులు అప్రమత్తమైయ్యారు. ఈ క్రమంలో ప్రజలకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. ఎవరికైనా అకౌంట్‌ నుంచి డబ్బులు పోతే క్షణం ఆలోచించకుండా వెంటనే 1930కి ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు తిరిగివచ్చే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయాలని విజ్ణప్తి చేశారు.

సైబర్ క్రైం పోలీసులు మాట్లాడుతూ..”ప్రజల్లారా జాగ్రత్తగా ఉండండి. మళ్లీ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీ ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తే వెంటనే మాకు ఫిర్యాదు చేయండి. అప్పుడే మీ డబ్బులు తిరిగివచ్చే అవకాశం ఉంది. నేషనల్ సైబర్ క్రైం పోర్టల్‌లో కానీ హెల్ప్ లైన్ నంబర్ 1930కి గాని వెంటనే ఫిర్యాదు చేయండి. తద్వారా బాధితుడి ఖాతా నుంచి బదిలీ అయిన నగదును ఇతర ఖాతాలకు బదిలీ అవ్వకుండా చేయవచ్చు. సత్వరమే ఫిర్యాదు చేసేందుకు గతేడాది జూన్‌లో తెలంగాణ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఈ కాల్ సెంటర్ 24/7 అందుబాటులో ఉంటుంది.” అని అన్నారు.

మరోపక్క ఇప్పటివరకూ సైబర్ నేరగాళ్లు కాజేసిన ₹15.48 కోట్లను వారి ఖాతాల్లో పోలీసులు నిలుపుదల చేశారు. ఆర్ధికపరమైన ఫిర్యాదులను నమోదు చేసిన వెంటనే అవి సీఎస్ఆర్ఎంఎస్‌లోకి వెళతాయి, దీంతో వెంటనే సంబంధిత నేరగాళ్ల ఖాతాల్లోని నగదు సీజ్ అవుతుంది. కాబట్టి ప్రజలు డబ్బులు పోయిన వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాలని పలు వివరానలు మీడియా ముందు వెల్లడించారు.