If you order alchippalu, good luck will come..
mictv telugu

ఆల్చిప్పలు ఆర్డర్ ఇస్తే, అదృష్టం కలిసొచ్చింది..

August 18, 2022

అమెరికా దేశంలో ఓ అరుదైన సంఘటన జరిగింది. ఆకలితో రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ కుటుంబం..ఆల్చిప్పల డిష్‌ను ఆర్డర్ చేస్తే, అనుకోని విధంగా అదృష్టం ప్లేట్ రూపంలో వచ్చింది. ఊహించని రీతిలో ఆల్చిప్ప షెల్ ఓపెన్ చేయగా దాని లోపల ఓ ఊదా రంగు కల్గిన ముత్యం ప్రత్యక్షమైంది. దాంతో వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ఏం చేయాలో తెలియక కొన్ని నిమిషాలపాటు తికతికపడ్డారు. చివరికి గుట్టుచప్పుడు కాకుండా ఆ ముత్యాన్ని తీసుకొని, అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వివరాల్లోకి వెళ్తే..ఫిలడెల్ఫియా ప్రాంతంలో కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌లో పనిచేస్తున్న స్కాట్ ఓవర్‌ ల్యాండ్ అనే వ్యక్తి.. ఇటీవలే తన కుటుంబ సభ్యులతో కలిసి డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఆపై ఆకలి వేయడంతో దగ్గర్లోని సాల్ట్ ఎయిర్ అనే రెస్టారెంట్‌కు వెళ్లి, ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆ మెనూలో ఆల్చిప్పలకు సంబంధించిన డిష్ కూడా ఉంది. సర్వ్ చేసిన అనంతరం ఆ డిష్ తింటుండగా.. చివర్లో వారు ఒక ఆల్చిప్ప షెల్ ఓపెన్ చేశారు. దాని లోపల ఓ ఊదా రంగులో ముత్యం ప్రత్యక్షమవ్వడంతో వారంతా సర్‌ప్రైజ్ అయ్యారు.

అనంతరం ఆ ముత్యాన్ని తిరిగి రెస్టారెంట్ వారికి ఇవ్వాలా, వద్దా అని వారిలో వారు చర్చించుకున్నారు. దొరికిన ముత్యం విలువ ఎంత ఉంటుందోనని..గూగుల్‌లో సెర్చ్ చేయగా.. ఆ ముత్యం విలువ 600 నుంచి 16,000 డాలర్ల మధ్య ఉంటుందని తేలింది. వెంటనే ముత్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా, బ్యాగులో వేసుకొని వెళ్లారు.

ఇక, ఆల్చిప్పలు అంటే..”చికెన్, ఫిష్, రొయ్యలు, పీతలు, నత్తలు ఇంకా రకరకాల మంసాల్లో ఆల్చిప్పలు ఒకటి. దీన్ని తినేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. కొందరు ఈ డిష్‌ను చాలా ఇష్టంగా తింటారు. అమెరికా వంటి పాశ్చాత్త దేశాల్లో ఆల్చిప్పలకు మంచి డిమాండ్ ఉంటుంది. సూప్, ప్రైతోపాటు ఇతర కూరలతో కలిపి ఈ ఆల్చిప్పలు వండుతారు. కొందరు మొప్పులను తీసేసి కర్రీ వండుతారు. ఇంకొందరు ఆ మొప్పలు ఉంచేసి ఉండుతారు”.