కేంద్రప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే భారత ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నిధులు, నియంత్రణలో ఉన్న స్వయంప్రతిపత్త సంస్థ టాటా మెమోరియల్ సెంటర్ తన అధికారిక వెబ్ సైట్లో ఎల్ డీసీ, అటెండెంట్, నర్సు, ఇతరాలతో మొత్తం 360పోస్టుల కోసం దరఖాస్తులకు ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 10, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపిక పూర్తిగా కూడా వ్రాతపరీక్ష, స్కిల్ టెస్టు ఆధారం జరగుతుంది. పలు ఖాళీల కోసం ఎంపిక ప్రక్రియ ప్రమాణాల పోస్టు వివరాల కోసం అభ్యర్థులు నోటిఫికేషన్ లింక్ ను చెక్ చేయవచ్చు.
తేదీ:
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ. జనవరి 10, 2023.
పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు:
లోయర్ డివిజన్ క్లర్క్ 18 పోస్టులు
అటెండర్ 20 పోస్టులు
ట్రేడ్ హెల్పర్ 70 పోస్టులు
నర్సు ఏ 212 పోస్టులు
నర్సు బి 30 పోస్టులు
నర్సు సి 55 పోస్టులు.
అర్హతలు :
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీసులో కనీసం మూడు నెలల వ్యవధితో ఎంఎస్ సిట్ లేదా కంప్యూటర్ కోర్సు చేయాలి. కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ ఉన్న అభ్యర్థులకు మూడు నెలల కంప్యూటర్ కోర్సు నుంచి మినహాయింపు ఉంటుంది.
విద్యార్హత , వయస్సు పరిమితి, జీతం , పోస్టుల కోసం ఇతర అప్ డేట్స్ కోసం నోటిఫికేషన్ లింక్ ను చెక్ చేయండి.
నోటిఫికేషన్ లింక్ : https://tmc.gov.in/m_events/Events/JobDetail?jobId=19545
వేతనం:
లోయర్ డివిజన్ క్లర్క్-రూ. 19,900/- + అలవెన్సులు, అటెండర్-రూ. 18000/+ అలవెన్సులు, ట్రేడ్ హెల్పర్-రూ. 18000/- + అలవెన్సులు
నర్సు,ఏ-రూ. 44,900/ అలవెన్సులు, నర్సు బి-రూ. 47,600/- + అలవెన్సులు, నర్సు – సి- రూ. 53,100/- + అలవెన్సులు ఉంటాయి.