గూగుల్‌లో ఇవి వెతికితే ఏకంగా జైలుకే - MicTv.in - Telugu News
mictv telugu

గూగుల్‌లో ఇవి వెతికితే ఏకంగా జైలుకే

May 11, 2022

డిజిటల్ యుగం నడుస్తున్న ప్రస్తుత ప్రపంచంలో మనకు ఏ సమాచారం కావాలన్నా నెట‌్‌లో దొరుకుతుంది. అలా అని ఏది పడితే అది వెతికితే కూడా ప్రమాదమే. ముఖ్యంగా మనం ఎక్కువగా ఉపయోగించే గూగుల్‌లో కింద చెప్పబోయే మూడు విషయాల గురించి సెర్చ్ చేస్తే భారత చట్టాల ప్రకారం జైలు శిక్ష విధిస్తారు. స్మార్ట్ ఫోన్లు విరివిగా వాడుతున్న ఈ కాలంలో ప్రతీ ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవడం ఉత్తమం. అవి
బాంబుల తయారీ : దేశానికి ఉగ్రవాదుల ముప్పు ఉన్న నేపథ్యంలో ఎవరైనా బాంబుల తయారీ గురించి వెతికితే అలాంటి వారిని సెక్యూరిటీ సంస్థలు వెంటనే గుర్తిస్తాయి. భద్రతాపరమైన కారణాలతో రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటే జైలు శిక్ష విధిస్తారు.

అబార్షన్ : గర్భస్రావాన్ని నిరోధించడానికి ప్రభుత్వం కఠిన చట్టాలను రూపొందించింది. వీటి ప్రకారం అబార్షన్ గురించి వెతికితే కటకటాల వెనక్కి నెడతారు. కేవలం కోర్టు, లేదా కొన్ని సందర్భాలలో డాక్టరు అనుమతితోనే అబార్షన్‌కు అవకాశముంటుంది. కొంతమంది అంతర్జాలంలో సమాచారం వెతికి గర్భస్రావం చేయడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

చైల్డ్ పోర్నోగ్రఫీ : చిన్నారులతో సెక్స్‌కు సంబంధించి కంటెంట్ వెతికితే కూడా శిక్షార్హులవుతారు. పొరపాటున వెతికినా కూడా పోక్సో చట్టం కింద జైల్లో వేస్తారు. ఏదో మామూలు శిక్ష కాకుండా ఏకంగా ఐదు నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశముంది. కాబట్టి నెటిజనులారా, ఈ విషయాలపై కాస్త దృష్టి సారించండి. లేకపోతే మీ కర్మకు మీరే బాధ్యులవుతారు.