గూగుల్‌లో ఈ 3 పదాలు వెతికితే.. ఇక అంతే - MicTv.in - Telugu News
mictv telugu

గూగుల్‌లో ఈ 3 పదాలు వెతికితే.. ఇక అంతే

May 12, 2022

గూగుల్‌లో ఇక నుంచి ఓ మూడు పదాలను సెర్చ్ చేసినా, వాటిని టైపు చేసినా జైలులో ఊచలు లెక్కించాల్సిందేనని అధికారులు హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా క్రైంను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అమల్లోకి వచ్చాయని, గూగుల్‌లో ఏదిపడితే అది వెతికినా, ఏమౌవుతుందిలే అని అనుకుంటే పొరపాటేనని తెలిపారు. ముఖ్యంగా ‘గూగుల్‌లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ, బాంబుల తయారీ, అబార్షన్‌’ అనే మూడు పదాలను వెతికినా, సెర్చ్ చేసిన కఠినమైన చర్యలు ఉంటాయని, ఏడేళ్లవరకు జైలు శిక్షపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

”చిన్నారులకు సంబంధించి పోర్నోగ్రఫీ కంటెంట్‌ను గూగుల్‌లో వెతికితే శిక్షార్హులవుతారు. పొరపాటున సెర్చ్‌ చేసినా పోక్సో చట్టం కింద జైలు ఖాయం అవ్వొచ్చు. ఈ నేరం కింద 5 నుంచి ఏడేళ్లవరకు జైలు శిక్ష పడుతుంది. బాంబులను ఎలా తయారు చేయాలని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే చిక్కులు తప్పవు. ఇటువంటి కంటెంట్‌ను వెతికినవారిని సెక్యురిటీ సంస్థలు గుర్తిస్తాయి. చట్టపరమైన చర్యలు తీసుకుంటే జైలు శిక్షపడే అవకాశం ఉంటుంది. అబార్షన్‌ చేయడమెలా? అని గనుగ గూగుల్‌లో వెతికితే కటకటాలు తప్పవు. గర్భస్రావాలను నిరోధించేందుకు భారత్‌ గట్టి చట్టాలను రూపొందించింది. అబార్షన్‌కు సంబంధించిన కంటెంట్‌ను సెర్చ్‌ చేస్తే భారతీయ చట్టాల ప్రకారం శిక్షార్హులు. డాక్టర్‌ అనుమతితోనే గర్భస్రావానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి” అని అధికారులు పేర్కొన్నారు.