If you travel in it, everything is royal pleasure...
mictv telugu

ఇందులో ప్రయాణిస్తే అన్నీ రాజభోగాలే…

November 9, 2022

భారత్‌లో అత్యంత ఖరీదైన రైలు ప్రయాణం ప్యాలెస్ ఆన్ వీల్స్ మళ్ళీ ప్రారంభమైంది. కరోనా వల్ల ఈ రైలు సేవలను ఇంతవరకూ ఆపేసారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మళ్ళీ మామూలు అవడంతో దీన్ని తిరిగి ప్రారంభించారు.పర్యాటకులు ఇకపై ఈ లగ్జరీ రైలులో హ్యాపీగా విహరించవచ్చు.

రాజస్థాన్ టూరిజం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వేస్ సంయుక్త ఆధ్వర్యంలో నడిచే ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలు తిరిగి ప్రారంభమైంది. కరోనా కారణంగా రెండేళ్ల క్రితం నిలిపివేసిన ఈ రైలును తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ గాంధీనగర్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. అందుకు సంబంధించిన విషయాలను రాజస్థాన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఫొటోలతో సహా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. దీంతో ఇప్పుడు భారత్‌లో అత్యంత ఖరీదైన రైలు ప్రయాణం మళ్లీ మొదలైంది.

ఈ ప్యాలెస్ ఆన్ వీల్స్ అనే అత్యంత ఖరీదైన రైలు మొదట 1981-82 కాలంలో ప్రారంభించారు. భారత దేశం స్వాతంత్రం సాధించాక రైల్వేస్‌ను జాతీయం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అంతకుముందు పలువురు మహారాజులకు ఉన్న లగ్జరీ రైళ్లను తొలగించారు. ఆ తర్వాత ఈ ప్యాలెస్ ఆన్ వీల్స్ అనే ఖరీదైన రైలు ప్రయాణాన్ని తీసుకొచ్చారు.

ఈ రైలు మొత్తం ఎయిర్ కండీషనింగ్‌తో నిండి ఉంటుంది. ఇందులో వైఫై, మ్యూజిక్, జిమ్, రెస్టారెంట్, స్పా, బార్‌ల వంటి అత్యాధునిక సౌకర్యాలు కూడా ఉంటాయి. దీంతో ఈ రైలులో ప్రయాణించేవారికి ఇదొక ఇంద్ర భవనంలా ఉంటుంది. అందువల్లే దీన్ని ప్యాలెస్ ఆన్ వీల్స్‌గా పిలుస్తారు. ఈ రైలు బోగీలు మొత్తం రాజస్థానీ కళా నైపుణ్యాలతో అత్యంత అందంగా ఉంటాయి.

ఈ రైలు ప్రయాణం మొత్తం వారం రోజులు ఉంటుంది. ఇందులో రాజస్థాన్‌లోని అన్ని టూరిస్ట్ ప్లేస్ లనూ చూపిస్తారు. జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, సావాయ్ మోధ్‌పూర్, చిత్తావుగర్హ్, ఉదయ్‌పూర్, భరత్‌పూర్, ఆగ్రా లాంటి ప్రాంతాల్లో ఈ రైలులోనే తిప్పుతూ మనకు అత్యంత ఖరీదైన ప్రయాణం అందిస్తారు.

ఈ రైలులో మొత్తం 39 డీలక్స్ క్యాబిన్లు ఉండగా 2 సూపర్ డీలక్స్ క్యాబిన్లు ఉన్నాయి. మొత్తం 82 మంది ప్యాసింజర్లే ఇందులో ప్రయాణించగలరు. ప్రతి క్యాబిన్‌కు ప్రత్యేకమైన టాయిలెట్ ఉంటుంది.ఈ రైలులో ప్రయాణిస్తుంటే అందమైన రాజ భవంతిలో ఉన్నట్లు ఉంటుందిట. అలాగే ప్రతి క్యాబిన్‌కు ఒక అటెండెంట్ ఉంటారు. వాళ్ళు మనకు సర్యలు చేస్తూ ఉంటారు.

అయితే ప్యాలెస్ ఆన్ వీల్స్‌ రైలులో ప్రయాణించాలంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ గట్టిగా ఉండాలిట. డబ్బులు బాగా ఉండి అందమైన ప్రయాణం చేయాలి అంటే ఫ్యాలెస్ ఆన్ వీల్స్ ఎంచుకోండి అని చెబుతున్నారు. కానీ ఒక్కసారైనా చేసి తీరాల్సిన అనుభవం అని చెబుతున్నారు. కాబట్టి దీన్ని కూడా మీ విష్ లిస్ట్ లో
చేర్చుకోండి.