If you want to break the idol..Fight master arrested
mictv telugu

విగ్రహాన్ని బద్దలు కొట్టాలన్నా..ఫైట్ మాస్టర్ అరెస్ట్

August 16, 2022

If you want to break the idol..Fight master arrested

తమినాడు రాష్ట్రంలో ఫైట్ మాస్టర్ కణల్‌ కన్నన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. మాస్టర్ వ్యాఖ్యలను ఖండిస్తూ, పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అనంతరం చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు..సోమవారం మాస్టర్‌ కణల్‌ కన్నన్‌‌ను పుదుచ్చేరిలో అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే..సినీ ఫైట్‌ మాస్టర్‌ కణల్‌ కన్నన్‌ గత నెల 31వ తేదీ స్థానిక మదురవాయిల్‌లో హిందూ మున్నని సమాఖ్య హిందువుల పరిరక్షణ కోసం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి హాజరైయ్యారు. ఆ సభలో అతడు మాట్లాడుతూ..” శ్రీరంగం ఆలయం ఎదురుగా, దేవుడిపై నమ్మకం లేని పెరియార్‌ విగ్రహాన్ని బద్దలు కొట్టాలి” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దాంతో ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. తందై పెరియార్‌ ద్రవిడ కావడంకు చెందిన చెన్నై జిల్లా కార్యదర్శి కుమరన్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో కణల్‌ వ్యాఖ్యల వీడియో ఆధారాలను పొందుపరిచారు. వీడియో ఆధారాలను పరిశీలించిన చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేయడంతో, విషయం తెలుసుకున్న కణల్‌ కన్నన్‌ పరారయ్యారు. 13 రోజుల తర్వాత పుదుచ్చేరిలో తలదాచుకుంటున్న సమాచారం అందడంతో, చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అక్కడ వెళ్లి సోమవారం కణల్‌ కన్నన్‌ను అరెస్ట్‌ చేసి చెన్నై తీసుకొచ్చారు.