If you want to buy an AC, you can get a discount of 31 thousand in the Flipkart sale
mictv telugu

ఏసీ కొనేవారికి గుడ్‎న్యూస్..ఈ కంపెనీ ఏసీపై రూ.31వేల డిస్కౌంట్..!!

February 10, 2023

If you want to buy an AC, you can get a discount of 31 thousand in the Flipkart sale

వచ్చేసింది ఎండాకాలం. రాత్రిచలిగా..పగలు మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. చాలా మంది వేసవిలో ఏసీ కొనేందుకు ప్లాన్ చేస్తుంటారు. అందుకే వేసవిలో ఏసీలు, కూలర్ల ధరలను అమాంతం పెంచేస్తుంటాయి కంపెనీలు. మీరు కూడా ఏసీ కొనుగోలు చేయాలనుకుంటే సమ్మర్ వరకు ఆగాల్సిన పనిలేదు. ఇప్పుడే ఏసీ కొనుగోలు చేస్తే తక్కువ ధరకు లభిస్తుంది. అయితే ఫ్లిప్ కార్టులో ఓసారి డిస్కౌంట్ ఆఫర్లను చెక్ చేయండి.

ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్ కార్ట్ గ్రాండ్ హోం అప్లియేన్సెస్ సేల్ నిర్వహిస్తోంది. ఈ నెల 7నుంచి ప్రారంభమైన ఈ సేల్ ఈనెల 11వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ బంపర్ సేల్ లో భాగంగా టీవీలు, ఏసీ ఇతర హోం అప్లియెన్సెస్ పై భారీ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. మీరు ఏసీ కొనుగోనులు చేయాలనుకుంటే మాత్రం ఈ సేల్ మీకు మంచి అవకాశం. ఈ సేల్ లో ముఖ్యంగా.. వార్ల్పుల్ 4 ఇన్ 1 కన్వర్టబుల్ కూలింగ్ 1.5 టన్ 3 స్టార్ స్లిప్ట్ ఇన్వేర్టర్ ఏసీ-వైట్ ఏసీపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఏసీ ధర రూ. 64,600గా దీనిపై 48శాతం డిస్కౌంట్ కు అందుబాటులో ఉంది.

48శాతం అంటే దాదాపు 31,610తగ్గుతుంది. పలు బ్యాంకుల క్రెడిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్స్ తో మరో రూ.2వేలు అదనపు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అంటే మొత్తం కలిపి దాదాపు 33వేల వరకు డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఎస్ బిఐ క్రెడిట్ కార్డు ఉన్నవారికి అదనం మరో రూ. 1500వరకు తగ్గింపు పొందవచ్చు. ఇలా అన్ని ఆఫర్లు కలపుకుంటే 36వేల డిస్కౌంట్ కు కొనుగోలు చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఏసీ కొనుగోలు చేయండి. ఎందుకంటే ఈ ఆఫర్ కేవలం ఒకరోజు మాత్రమే ఉంది.