ఐఫోన్ అంటేనే ఒక స్టేటస్ సింబల్. చాలామంది ఐఫోన్ కలిగి ఉండటం, తమ స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు. కానీ ఆపిల్ ఐఫోన్ ధర మాత్రం.. ప్రస్తుతం మార్కెట్లో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే చాలా అధికంగా ఉంటుంది. స్టేటస్ సింబల్‌గా మాత్రమే కాదు.. ఈ ఫోన్ సెక్యూరిటీ పరంగా కూడా చాలా సేఫ్ అని చెబుతుంటారు నిపుణులు. అలాంటి ఐఫోన్ అతి తక్కువ ధరకే ఎలా కొనాలో తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ సిరీస్‌లను విడుదల చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఐఫోన్ 12 మినీపై అందుబాటులో ఉన్న ఆఫర్ల ఏంటో ఓసారి చూద్దాం. ఈ ఆఫర్ ద్వారా మీరు అతి తక్కువ ధరకే ఐఫోన్ సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఒక్క రూపాయి చెల్లించకుండా ఐఫోన్ కొనే చాన్స్..
ఐఫోన్ 12 మినీపై ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారులకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 59,999, అయితే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 37,999కి కొనే అవకాశం ఉంది. ఇది కాకుండా మీ బాధ ఐ ఫోన్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గరిష్టంగా రూ. 37,999 వరకూ మీకు తిరిగి చెల్లించే అవకాశం ఉంది. అంటే మీరు ఈ ఆఫర్‌ను మొత్తం ఉపయోగించుకుంటే, మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 12 మినీ ఫీచర్లు
ఐఫోన్ 12 మినీ స్మార్ట్‌ఫోన్‌లో, మీకు 5.4 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్ప్లే ఉంది. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్లో 12 మెగాపిక్సెల్‌లు , చొప్పున రెండు కెమెరాలు ఉన్నాయి. దీనితో పాటు, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఐఫోన్ 12 మినీ స్మార్ట్‌ఫోన్ A14 బయోనిక్ చిప్సెట్ ఆధారంగా రూపొందించారు. ఇది సిరామిక్ షీల్డ్‌తో వస్తుంది. ఈ ఫోన్ పరిశ్రమలో ప్రముఖ IP68 వాటర్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్‌తో వస్తుంది.
ఫోన్లో నైట్ మోడ్, 4కె డాల్బీ విజన్ హెచ్‌డిఆర్ రికార్డింగ్ ఉంది. iphone 12 mini 64 GB, 128 GB, 256 GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఇది 5G టెక్నాలజీని సపోర్ట్ చేసే ఫోన్, దీని బరువు 133 గ్రాములు. మీరు ఈ ఫోన్‌ను నలుపు, తెలుపు, ఎరుపు, నీలం రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 12 మినీ IP68 రేటింగ్‌తో వస్తోంది. దీని కారణంగా ఇది డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ గా వస్తోంది.