నేటికాలంలో చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. దీనికి కారణం మారుతున్న జీవినశైలి, ఆహారపు అలవాట్లు. పొట్టలో పేరుకుపోయిన కొవ్వు తగ్గించుకునేందుకు చాలామంది గంటల తరబడి వ్యాయామం చేస్తుంటారు. అయితే వ్యాయాయం లేకుండానే సులభంగా ఫ్యాట్ తగ్గించుకునే మార్గాలుకూడా ఉన్నాయి. డైట్ లో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల కొవ్వును సులభంగా తగ్గించవచ్చు. శరీరంలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటే ముఖంపై ముడతలు, మచ్చలు కూడా వేధిస్తుంటాయి. బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవాలంటే కార్బొహైడ్రెట్లు తక్కువగా ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవాలి.
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఈ టిప్స్ పాటించండి:
– బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడానికి డైటింగ్ చేయడం..ఏ విధంగానూ సరైంది కాదు. ఎందుకంటే ఇది శరీరంపై తక్కువ సానుకూల, ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఖాళీ కడుపుతో ఎక్కువ సేపు ఉండడం వల్ల శరీరంలోని జీవక్రియలు మందగిస్తాయి. దీంతో అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఆకలితో అలమటించే బదులు పండ్లు, రసాలను ఆహారంలో చేర్చుకోండి.
-అల్పాహారాన్ని అస్సలు మానేయకండి. అల్పాహారంలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే వాటిని చేర్చండి. దీని వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దీని వల్ల మళ్లీ మళ్లీ ఆకలి అనిపించదు.
– పొట్ట తగ్గాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.
– ఆహారం అధికంగా నూనె పదార్థాలు ఉండకూడదు. నూనెను వాటడం ఎంత తగ్గిస్తే అంత మంచిది.
– పొట్ట కొవ్వు తగ్గడానికి, అధిక ఫైబర్ ఉన్న కూరగాయలు, గుమ్మడికాయ, పొట్లకాయ తినడం చాలా మంచిది.
– మామూలు నీటికి బదులు గోరువెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.
– సాయంత్రం స్నాక్స్‌లో సమోసాలు, ప్యాటీలు తినడానికి బదులు, వేయించిన వేరుశెనగలను తినేందుకు ట్రై చేయండి.