‘ప్రియమైన నిక్కూ, మనిద్దరం కలిసి ఉండటమే నాకు ఓ అద్భుత ప్రదేశం. నువ్వు నా పక్కనే ఉంటే..ఒక్క చేత్తో ఈ ప్రపంచాన్ని జయించగలను. ఇన్నేళ్ల మన లవ్ జర్నీలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో మధుర క్షణాలు. అన్నింటిని మించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన 21 ఏళ్ల కలయికలో పెళ్లై 12 ఏళ్లు గడిచాయి. నా వృద్ధాప్యం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.’ అని టాలీవుడ్ యాంకర్, నటీ అనసూయ ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్‌ను గురించి చెప్పుకొచ్చారు.
View this post on Instagram
ఒకవైపు పలు ఛానెల్స్‌లో షోలు చేస్తూ, మరోవైపు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ అనసూయ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం అనసూయ, ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్‌లకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో..’అనసూయ, సుశాంక్ ఒకరినొకరు ప్రేమగా హత్తుకుని, లిప్‌లాక్, రొమాంటిక్ ఫోజులు ఇస్తున్నారు. తమ 12వ వెడ్డింగ్ యాన్నివర్సరీ సందర్భంగా భర్తతో కలిసి ఆమె పకృతి ఒడిలో సముద్రం ఒడ్డున నీటి అలల మధ్య గడిపింది. అనసూయ వీడియోను షేర్ చేస్తూ ‘మన 21 ఏళ్ల కలయికలో పెళ్లై 12 ఏళ్లు గడిచాయి. నా వృద్ధాప్యం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.’ అని రాసుకొచ్చారు.
ప్రస్తుతం అనసూయ.. దర్జా, వాంటెడ్ పండుగాడ్, గాడ్ ఫాదర్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలతో, యాంకరింగ్‌తోపాటు సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్‌గా ఉంటారు. తన గ్లామరస్ ఫొటోలతో, కుటుంబంతో ఆడిపాడే క్షణాలు పోస్ట్‌ల రూపంలో అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలో తన భర్త సుశాంక్ భరద్వాజ్‌తో బీచ్‌లో సందడి చేసిన వీడియోను షేర్ చేశారు.