కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలి... ఐఎఫ్‌టీయూ - MicTv.in - Telugu News
mictv telugu

కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలి… ఐఎఫ్‌టీయూ

March 30, 2022

bvvb

మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలు కార్మిక సంఘాలు కదం తొక్కాయి. సార్వత్రిక సమ్మెలో భాగంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్.టీ.యు) ఆధ్వర్యంలో నిజమాబాద్ జిల్లా ఆర్మూర్‌లో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించివది. తర్వాత బహిరంగ సభ నిర్వహించారు.

ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ (ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర నాయకులు వి.ప్రభాకర్ తదితరులు ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలతో దేశాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు. ‘కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చడానికే 4 కార్మిక వ్యతిరేక కోడ్లు తీసుకొచ్చిoది. వీటిని రద్దు చేయాలని కోరుతున్నాం. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం అందేలా చూడాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపేసి కాంటాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ వంట నూనె ధరలను భారీగా తగ్గించాలి’ అని వారు డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన ఉద్యమస్ఫూర్తితో ప్రభుత్వాల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కార్మిక వర్గానికి, ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్, జిల్లా అధ్యక్షులు ఎం.ముత్తన్న, ప్రజా సంఘాల నాయకులు బీ.దేవారం, డి.రాజేశ్వర్, ఎం.వెంకన్న, సత్యక్క, సురేష్, రమేష్, రాజేశ్వర్, నడ్పన్న తదితరులు మరియు రెండు వేల మంది కార్మికులు పాల్గొన్నారు.