ఇతరుల వ్యాఖ్యలు నేను పట్టించుకోను - నారా భువనేశ్వరి - MicTv.in - Telugu News
mictv telugu

ఇతరుల వ్యాఖ్యలు నేను పట్టించుకోను – నారా భువనేశ్వరి

December 20, 2021

టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై ఏపీ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు సోమవారం ఆమె స్పందించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్టు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో ఏ మహిళను అవమానించినా, అది సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. తప్పిదాలు చేసి, సమాజంలో పాపాత్ములుగా పేరు తెచ్చుకోవద్దన్నారు. ఇటీవల ఆమెపై అసెంబ్లిలలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై రిపోర్టర్లు ప్రశ్నించారు.

ఇతరులు చేసిన వ్యాఖ్యలు తాను పట్టించుకోనని సమధానం ఇచ్చారు. ప్రతి విషయాన్ని పట్టించుకుంటూ పోతే, సమయం వృథా అవుతుందన్నారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ తరుపున రూ. 1 లక్ష చొప్పున ఆర్ధిక సాయం చేశారు.