IIFA Awards 2023: ఉత్తమ నటుడు హృతిక్ రోషన్.. నటి అలియా భట్
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(The International Indian Film Academy Awards 2023) ఐఫా అవార్డుల వేడుక దుబాయ్‌లో అట్టహాసంగా జరిగింది. శనివారం రాత్రి యూఏఈ రాజధాని అబుదాబిలో జరిగిన ఈ సంబరానికి బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ ఏడాది ఐఫా 2023 (iifa 2023) అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డును హృతిక్ రోషన్ (Vikram Veda) సొంతం చేసుకోగా, గంగూబాయి కాఠియావాడి చిత్రంలో నటనకు గానూ అలియాభట్(Alia Bhatt) ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక మిస్టరీ థ్రిల్లర్ ‘దృశ్యం2’ (హిందీ) ఉత్తమ చిత్రంగా నిలిచింది. అత్యధిక అవార్డులను ‘బ్రహ్మాస్త్ర: పార్ట్-1’, ‘గంగూబాయి కాఠియావాడి’ చిత్రాలు దక్కించుకున్నాయి.
అలాగే అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఫ్యాషన్ ఇన్ సినిమా అవార్డు మనీష్ మల్హోత్ర అందుకోగా, భారతీయ చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించినందుకు గానూ నటుడు కమల్‌హాసన్ అవుట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని అందుకున్నారు. అవుట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ రీజినల్ సినిమా పురస్కారాన్ని రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా దంపతులు అందుకున్నారు. అలియా భట్ ఈ అవార్డుల వేడుకకు హాజరుకాలేదు. దీంతో ఉత్తమ నటి అవార్డును ఆమె తరపున నిర్మాత జయంతిలాల్ స్వీకరించారు.
ఐఫా 2023 అవార్డుల విజేతలు వీళ్లే (iifa 2023 awards winners)
Best Actor: హృతిక్ రోషన్ (విక్రమ్ వేద)
Best Actress: అలియా భట్ (గంగూబాయి కాఠియావాడి)
Best Supporting Actor: అనిల్ కపూర్ (జగ్‌జగ్ జీయో)
Best Supporting Actress: మౌనీ రాయ్(బ్రహ్మాస్త్ర: పార్ట్-1)
Best Direction: ఆర్.మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్)
Best Picture: దృశ్యం2
Best Music Director: ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర: పార్ట్-1)
Best Lyrics: అమిత్ భట్టాచార్య (కేసరియా: బ్రహ్మాస్త్ర: పార్ట్-1)
Best cinematography: గంగూబాయి కాఠియావాడి
Best Screenplay : గంగూబాయి కాఠియావాడి
Best Conversations: గంగూబాయి కాఠియావాడి
Best choreography: భూల్ భూలయా2
Best Sound Design : భూల్ భూలయా 2
Best Editing: దృశ్యం2
Best Visual Effects : బ్రహ్మాస్త్ర: పార్ట్-1
Best background music: విక్రమ్ వేద
Best Sound Mixing: మోనికా ఓ మై డార్లింగ్
Best Debut Male: శంతను మహేశ్వరి (గంగూబాయి కాఠియావాడి), బబ్లీ ఖాన్(ఖులా)(ఇద్దరి మధ్య టై అయింది)
Best Debut Female: కుషాలీ కుమార్ (దోఖా: రౌండ్ డి కార్నర్)