IIT JEE Advanced 2022 Result Declared , Score cards, final answer released
mictv telugu

విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌.. జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 ఫలితాలు విడుదల

September 11, 2022

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి ఆదివారం ఉదయం 10 గం.లకు JEE అడ్వాన్స్ డ్ 2022 ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు JEE అడ్వాన్స్ డ్ అధికారిక సైట్ jeeadv. ac.in, రిజల్ట్స్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు వారి రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి రిజల్ట్స్‌ను చెక్ చేసుకోవచ్చు. వారి స్కోర్ కార్డును, ర్యాంక్‌లను చూసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలతో పాటు మెరిట్‌ లిస్ట్‌‌ను కూడా విడుదల చేశారు. ఇక, ఎగ్జామ్ ఫైనల్ ఆన్సర్ కీని కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఈ సంవత్సరం.. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పేపర్ 1, పేపర్ 2 రెండింటిలోనూ మొత్తం 1,55,538 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 40712 మంది అర్హత సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఆర్కే శిశిర్ టాపర్‌గా నిలిచారు. శిశిర్ 360 మార్కులకు గానూ 314 మార్కులు సాధించారు. శిశిర్ ఐఐటీ బాంబే జోన్‌కు చెందినవారు. ఇక, జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 12న జరిగే జాయింట్ సీట్ల కేటాయింపు (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..
-అధికారిక వెబ్‌సైట్‌ https://result.jeeadv.ac.in/ను సందర్శించాలి.
-అక్కడ అడ్వాన్స్‌డ్ 2022 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి.
-లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి- రిజిస్ట్రేషన్ నంబర, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ పై క్లిక్ చేయాలి.
– అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

దేశంలోని ఐఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను పరీక్షను నిర్వహించారు. గత నెల 28న జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్షను ఐఐటీ బాంబే నిర్వహించింది. సెప్టెంబర్ 3వ తేదీన ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేశారు.