IIT madras team develops wheel chair that can run on roads at 25kmph
mictv telugu

ఈ వీల్ చెయిర్ గంటకు 25 కి.మీ.ల వేగంతో దూసుకెళ్తుంది!

February 1, 2023

IIT madras team develops wheel chair that can run on roads at 25kmph

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ-ఎమ్) ఒక మోటరైజ్డ్ వీల్ చెయిర్ ని తయారు చేసింది. దీనికి నియో బోల్ట్ అని పేరు పెట్టారు. ఇది గంటకు 25 కి.మీ.ల వేగంతో పరుగు పెడుతుంది. లిథియం అయాన్ బ్యాటరీ తో ఇది పని చేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 25కి.మీ.ల మేర ప్రయాణించవచ్చు. ప్రొఫెసర్ సుజాత శ్రీనివాసన్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పని చేస్తారు. ఆమె ఆధ్వర్యంలో ఈ వీల్ చెయిర్ ని తయారు చేశారు. నియో మోషన్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. తక్కువ ఖర్చుతో, దివ్యాంగులకు అనుకూలంగా బయటకు వెళ్లేందుకు ఇతర స్కూటర్స్ కంటే కూడా ఇది బాగా పని చేస్తుంది.

ఈ టీమ్ నియో ఫ్లై అనే మరో ప్రాజెక్ట్. దీని ద్వారా వీల్ చెయిర్ని 18 కస్టమైజేషన్ యూజర్ కి కావాల్సిన రీతిలో దీన్ని తయారు చేసి ఇస్తారు. సుజాత శ్రీనివాసన్.. ‘నియో బోల్డ్ ని.. నియో ఫ్లైగా మారుతుంది. దీనివల్ల రోడ్డు మీదకు వీల్ చెయిర్ తీసుకువెళ్లినప్పుడు నావిగేట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వంకలు తిరిగినా వీధుల్లో, కొద్దిగా ఎత్తయిన ప్రదేశాలు కూడా ఎక్కేలా ఈ వీల్ చెయిర్ పని చేస్తుంది. ఎ:తో సౌకర్యవంతంగా అనిపించేలా దీన్ని డిజైన్ చేశారు’ అంటున్నది. ఈ స్టార్టప్ ను ప్రొఫెసర్ సుజాత శ్రీనివాసన్, నియో మోషన్ సీఈఓ అయిన ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి స్వోస్టిక్ సౌరవ్ డాష్ సహ స్థాపించారు.

నియో బోల్ట్..
సంవత్సరానికి 3 లక్షల వీల్ చెయిర్ లను ఈ దేశంలో కొంటున్నారు. 2.5 లక్షల వీల్ చెయిర్ లను ఎగుమతి చేస్తున్నారు. ఈ లెక్కన మన దేశంలో వీల్ చెయిర్ లు అమ్ముడు పోతున్నాయి. అయితే ఈ వీల్ చెయిర్ లు వారికి ఎంత వరకు అనుకూలంగా ఉంటాయోనన్నది ఎవ్వరూ ఆలోచించడం లేదు. అందుకే వీటిని తయారు చేశామంటున్నదీ టీమ్. పెటెంట్ తీసుకున్న నియోబోల్ట్ లో డిజిటల్ డ్యాష్ బోర్డ్ ఉంటుంది. అంతేకాదు.. హెడ్ లైట్, సైడ్ ఇండికేటర్, హారన్, అద్దం, రివర్స్ చేసుకునేలా, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇలా అన్ని హంగులతో ఈ వీల్ చెయిర్ పని చేస్తుంది. నియో ప్లై, నియో బోల్ట్ ని 28 రాష్ట్రాల్లో 600 మంది వీటిని వాడుతున్నారు.

వారంటీతో పాటు..
నియో మోషన్ సహ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ.. ‘భారతదేశంలోని ప్రధాన నగరాల్లో 15 డీలర్ అవుట్ లెట్స్, నాలుగు పునరావాస కేంద్రాల్లో ఈ డెమో యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. మా ప్రత్యేకమైన నియో ఫిట్ సిస్టమ్ తో పని చేస్తుంది. ఉత్పత్తి వారంటీతో పాటు, విడిభాగాలను అమ్ముతాం. తద్వారా మా వినియోగదారులు ఉత్పత్తులను అవాంతరాలు లేకుండా ఉపయోగించవచ్చు. నియో ఫ్లై పర్సనలైజ్డ్ వీల్ చెయిర్ ధర రూ.39,900, నియో బోల్ట్ మోటరైజ్డ్ యాడ్ ఆన్ రూ.55,00’ అని చెప్పారు.