IIT student commits suicide by hanging himself on bed
mictv telugu

మంచానికి ఉరేసుకుని ఐఐటీ విద్యార్థి ఆత్మ‌హ‌త్య

August 31, 2022

హైదరాబాద్ శివారు కందిలోని ఐఐటీలో ఓ ఎంటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మంచానికి ఉరేసుకొని చనిపోయాడని అధికారులు చెప్తుండగా, అదెలా సాధ్యమని విద్యార్ధి తండ్రి ప్రశ్నిస్తున్నాడు. వివరాల్లోకెళితే.. ఏపీలోని నంద్యాలకు చెందిన రాహుల్ అనే విద్యార్ధి ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

బుధవారం తెల్లారేసరికి తాను ఉంటున్న హాస్టల్ గదిలోని మంచానికి ఉరేసుకొని చనిపోయిన స్థితిలో కనిపించాడు. దీంతో హుటాహుటిన స్పందించిన యాజమాన్యం.. శవాన్ని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆలస్యంగా సమాచారం అందుకున్న రాహుల్ తల్లిదండ్రులు ఉరుకులుపరుగుల మీద ఐఐటీకి చేరుకోగా, అప్పటికే పోస్టుమార్టం పూర్తవ్వడం, మృతదేహాన్ని చూపించడానికి అధికారులు నిరాకరించడంతో వారికి అనుమానం కలిగింది. ఎవరైనా మంచానికి ఉరేసుకుంటారా? అని అడిగిన ప్రశ్నకు అధికారుల నుంచి జవాబు కరువైంది. నిజంగా ఆత్మహత్య చేసుకుంటే మృతదేహాన్ని ఎందుకు చూపించడం లేదని నిలదీయడంతో అధికారులు దిక్కులు చూస్తున్నారు. మరి ఏమవుతుందో వేచి చూడాలి.